ఓటీటీలో స్టార్స్‌ తళుకులు

ABN , First Publish Date - 2020-09-13T05:30:00+05:30 IST

ఓటీటీలో స్టార్స్‌ తళుకులు

ఓటీటీలో స్టార్స్‌ తళుకులు

లాక్‌డౌన్‌ సమయంలో అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ5 సబ్‌స్ర్కిప్షన్లు 65 నుంచి 80 శాతం మేర పెరిగాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే ప్రేక్షకులు ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారనడానికి ఇదే నిదర్శనం. అదే సమయంలో డిజిటల్‌ మీడియా వల్ల కొత్తవారికి అవకాశాలు  వెల్లువలా వస్తున్నాయి. సినిమాల్లో నటించి సరైన గుర్తింపు పొందలేకపోయిన వారికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సరైన వేదికలుగా నిలిచాయి.వెబ్‌సిరీ్‌సల్లో నటించి పాపులర్‌ అయిన కొందరు నటీనటుల విశేషాలు ఇవి..



జైదీప్‌ అహ్లావత్‌

దశాబ్దకాలంగా సినిమా రంగంలో ఉన్నా, ఈ నటుడు పెద్దగా గుర్తింపు పొందలేదు. కానీ ఇప్పుడు ‘పాతాళలోక్‌’ వెబ్‌సిరీ్‌సతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యాడు. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలయిన ఈ వెబ్‌సిరీస్‌లో హాథీరామ్‌ చౌదరి అనే పోలీస్‌ పాత్రలో కనిపించాడు జైదీప్‌. ‘రాయిస్‌’, ‘కమాండో’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసేపూర్‌’, ‘రాజీ’ వంటి పలు చిత్రాల్లో నటించాడు.


మిథిలా పల్కర్‌

యూట్యూబ్‌ స్టార్‌గా పేరు పొందిన మిథిలా పల్కర్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘ఛాప్‌స్టిక్స్‌’, వెబ్‌సిరీస్‌ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. 2016లో పాపులర్‌ మరాఠీ పాట ‘హే చల్‌ తురు తురు’ పాటను ‘పిచ్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమాలోని ‘ది కప్‌సాంగ్‌’ స్టయిల్‌లో పాడి పాపులర్‌ అయింది. ఆ పాటతో మిథిలాకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పాల్కర్‌ యూట్యూబ్‌ వీడియోకు 40 లక్షల వ్యూస్‌ వచ్చాయి. తరువాత ‘గర్ల్‌ ఇన్‌ ద సిటీ’ అనే వెబ్‌సిరీ్‌సలో నటించింది. తరువాత వరుసగా వెబ్‌సిరీ్‌సలో నటించే అవకాశాలు వచ్చాయి. ‘రైట్‌ టైమ్‌లో, రైట్‌ ప్లేస్‌లో ఉన్నందుకు సంతోషంగా ఉంది’ అని అంటోన్న పల్కర్‌ ప్రస్తుతం ‘త్రిభంగ’ అనే వెబ్‌సిరీ్‌సలో నటిస్తోంది.


సయానీ గుప్తా

‘ఫ్యాన్‌’, ‘బార్‌ బార్‌ దేఖో’, ‘ఆర్టికల్‌15’ వంటి చిత్రాల్లో నటించినా, బాగా గుర్తింపు పొందింది మాత్రం ‘ఫోర్‌ మోర్‌ షార్ట్స్‌’ వెబ్‌సిరీ్‌సతోనే. ఆమె నటించిన ‘ఆక్సోన్‌’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోనే విడుదలైంది. ఇందులో నేపాలీ మహిళగా నటించింది. ‘‘ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ సర్వీసులు నటులకు మాత్రమే కాకుండా రచయితలు, దర్శకులు, టెక్నీషియన్లకు అవకాశాలు వచ్చేలా చేశాయి’’ అని అంటారు సయానీ.


బరున్‌ సోబ్టి

వెబ్‌సిరీ్‌సలతో స్టార్‌గా ఎదిగారు. ‘అసుర్‌’, ‘తాన్హియాన్‌’, ‘ది గ్రేట్‌ ఇండియన్‌ డిస్‌ఫంక్షనల్‌ ఫ్యామిలీ’... వెబ్‌సిరీ్‌సలు బరున్‌ సోబ్టికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. టీవీ నుంచి డిజిటల్‌ రంగంలోకి మారాక అవకాశాలు అందిపుచ్చుకున్నారు సోబ్టి. ‘‘సినిమాల్లో, టీవీరంగంలో మంచి కంటెంట్‌ను సృష్టించడానికి ఒటీటీ వేదికలు ఉపయోగపడతాయి’’ అని అంటారు సోబ్టి. 


సుమీత్‌ వ్యాస్‌

సినిమా అంటే స్టార్స్‌పై ఫోకస్‌ ఉంటుంది. హీరోను బట్టి బాక్సాఫీసు కలెక్షన్లు ఉంటాయి. కానీ ఒటీటీలో అలా కా దు. కంటెంట్‌ ఉంటే చాలు. ‘‘డిజిటల్‌ మీడియా వల్ల హీరోలు సైతం తమ సినిమాల కంటెంట్‌ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఏర్పడింది’’ అంటారు సుమీత్‌ వ్యాస్‌. బాలీవుడ్‌లో సపోర్టింగ్‌ రోల్స్‌ వేసిన సుమీత్‌, డిజిటల్‌ మీడియా సక్సెస్‌ స్టార్‌గా గుర్తింపు పొందాడు. ‘ది వెర్డిక్ట్‌ - స్టేట్‌ వర్సెస్‌ నానావతి’ వెబ్‌సిరీస్‌ సుమీత్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

Updated Date - 2020-09-13T05:30:00+05:30 IST