ఈవీఎం భవనం ప్రారంభము

ABN , First Publish Date - 2022-01-31T05:20:32+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈవీఎం భవనంను ఆదివారం రాష్ట్ర చీఫ్‌ ఎలక్ర్టోరల్‌ ఆఫీసర్‌ శశాంక్‌గోయల్‌, కలెక్టర్‌ జితేష్‌వి.పాటిల్‌తో కలిసి ప్రారంభించారు.

ఈవీఎం భవనం ప్రారంభము
పూజ కార్యక్రమంలో పాల్గొన్న చీప్‌ ఎలక్ర్టొరల్‌ ఆఫీసర్‌ శశాంక్‌గోయల్‌, జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 30: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈవీఎం భవనంను ఆదివారం రాష్ట్ర చీఫ్‌ ఎలక్ర్టోరల్‌ ఆఫీసర్‌ శశాంక్‌గోయల్‌, కలెక్టర్‌ జితేష్‌వి.పాటిల్‌తో కలిసి ప్రారంభించారు. ఈవీఎం, వీవీ ప్లాట్లను ఈ భవనంలో భద్రపరుచుకోవచ్చని శశాంక్‌గోయల్‌ తెలిపారు. అంతకుముందు ఆయనకు జిల్లా అధికారులు స్వాగతం పలికి మొక్కలను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే తదితరులు పాల్గొన్నారు.

సమీకృత మార్కెట్‌ పనుల పరిశీలన

కామారెడ్డి గాంధీగంజ్‌లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ సముదాయం పనులను ఆదివారం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అంతకుముందు రాజీవ్‌ స్వగృహకు సంబంధించిన ప్లాట్ల హద్దులను పరిశీలించారు. పరిసరాలను త్వరగా శుభ్రపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, సర్వేయర్‌, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-31T05:20:32+05:30 IST