రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-18T05:56:54+05:30 IST

ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీతో అందజేస్తున్న విత్తన వేరుశనగ తొలి విడత పంపిణీని సోమవారం అధికారులు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో ప్రారంభించారు.

రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభం
డీ హీరేహాళ్‌లో విత్తన పంపిణీని పరిశీలిస్తున్న ఏడీఏ పుష్పలత

ఉరవకొండ, మే 17: ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీతో అందజేస్తున్న విత్తన వేరుశనగ తొలి విడత పంపిణీని సోమవారం అధికారులు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో ప్రారంభించారు. మండలంలోని పెద్దకౌకుంట్ల, పెద్దముష్టూరు, ఆమిద్యాల, రాకెట్ల, మోపిడి, చిన్నముష్టూరు, షేక్షానుపల్లి గ్రామాల్లో రైతులకు విత్తన కాయలు పంపిణీ చేశారు. తొలిరోజు 176 మంది రైతుల కు 157.2 క్వింటాళ్లను పంపిణీ చేసినట్టు ఏఓ శశికళ తెలిపారు.


గుత్తి రూరల్‌ : మండలంలోని బసినేపల్లి, బేతాపల్లి, కరిడికొండ, వన్నేదొడ్డి, తురకపల్లి గ్రామాల్లో సోమవారం విత్తన వేరుశనగ కాయలను పంపిణీ చేశారు. 301 మంది రైతులకు 309 క్వింటాళ్లను ఏఓ ముస్తాక్‌ అహమ్మద్‌ పంపిణీ చేశారు. రెండవ విడతలో పేర్లను న మోదు చేసుకున్న వారికి విత్తనాన్ని పంపిణీ చేస్తామన్నారు.


బొమ్మనహాళ్‌ : మండలంలోని నేమకల్లు గ్రామంలో సోమవారం వ్యవసాయాధికారి అహ్మద్‌ బాషా ఆధ్వర్యంలో విత్తన పంపిణీని ప్రా రంభించారు.. రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్‌పర్సన కాపు భారతి ముఖ్య అతి థిగా హాజరై రైతులకు పంపిణీ చేశారు. మొదటి విడతగా నేమకల్లు, కురువళ్లి, ఏళంజి, లింగదహాళ్‌, ఉంతకల్లు గ్రామాల 360 మంది రైతులకు 315.9 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు ఏవో అహ్మద్‌ బాషా తెలిపా రు. కార్యక్రమంలో సర్పంచ పరమేష్‌, వీఆర్వో వినయ్‌ కుమార్‌ రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 


డీ హీరేహాళ్‌ : మండలంలో సోమవారం డీ హీరేహాళ్‌, పులకుర్తి, మురడి, ఎం హనుమాపురం, గొడిశెలపల్లి గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో 923 మంది రైతులకు గాను 843 క్వింటాళ్ల విత్తన వేరుశన గ పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయాధికారి నిర్మల్‌ కుమార్‌ తె లిపారు. మురడి గ్రామంలో ఏడీఏ పుష్పలత పంపిణీని పరిశీలించా రు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


పెద్దవడుగూరు : మండలంలో మొదటివిడతలో 470 మంది రై తులకు గాను 409 మందికి సోమవారం విత్తన వేరుశనగ పంపిణీ చేసినట్లు వ్యవసాయాధికారి కృష్ణభగవాన తెలిపారు. రెండవ విడత లో లక్షుంపల్లి, పెద్దవడుగూరు, చిట్టూరు, కాశేపల్లి రైతులు రైతుభరో సా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రసాయనిక, క్రిమిసంహారక మందులు, పత్తివిత్తనాలు కావాల్సిన రైతులు ముందస్తుగా రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 


పుట్లూరు : మండలంలో 22 మంది రైతులకు 17.9 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేసినట్లు సోమవారం ఏఈఓ నాగిరె డ్డి తెలిపారు. పుట్లూరు, తక్కళ్లపల్లి, సి. వెంగన్నపల్లి, కోమటికుంట్ల, మడుగుపల్లి గ్రామాల రైతులకు పంపిణీ చేశామన్నారు. ఎవరికైనా నాసిరకం విత్తనాలు వస్తే సిబ్బందికి తెలపాలన్నారు. పంపిణీని ఏ ఈఓ నాగిరెడ్డి, హరి పరిశీలించారు. 


వజ్రకరూరు : రైతులకు 35 క్వింటాళ్ల విత్తన వేరుశనగను సోమ వారం పంపిణీ చేసినట్లు ఏఓ వెంకటరాముడు తెలిపారు. మొదటి వి డతలో భాగంగా పీసీప్యాపిలి, వెంకటాంపల్లి, తట్రకల్లు, వజ్రకరూరు, గూళ్యపాళ్యం రైతులకు అందజేశామన్నారు. రెండవ విడతలో చాబా ల, గంజికుంట, కొనకొండ్ల, తట్రకల్లు గ్రామాల రైతులు పేర్లను న మోదు చేసుకోవాలన్నారు.


కుందర్పి : మండలంలో పలు గ్రామాల్లో సోమవారం సబ్సిడీ వేరు శనగను పంపిణీ చేసినట్లు ఏఓ రాజీవన తెలిపారు. తొలిరోజు బసాపురం, నిజవళ్లి, కరిగానపల్లి, తెనగల్లు గ్రామాల రైతులకు అందజేశామన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. 


బెళుగుప్ప : మండలంలో మొదటి రోజు 194 మంది రైతులకు సబ్సిడీ విత్తన వేరుశనగ సోమవారం పంపిణీ చేసినట్లు ఇనచార్జి వ్య వసాయాధికారి పృథ్వీసాగర్‌ తెలిపారు. కార్యక్రమంలో రమేనేపల్లి స ర్పంచు రమేష్‌, సచివాలయ సిబ్బంది శ్రావణి పాల్గొన్నారు. 


కంబదూరు : మండలకేంద్రంలో సోమవారం విత్తన వేరుశనగ పంపిణీని తహసీల్దారు ఈశ్వరయ్యశెట్టి, సర్పంచు పద్మావతమ్మ చేతు ల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి మ హేష్‌, విస్తరణాధికారి ద్రాక్షాయణి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 


రాయదుర్గం రూరల్‌ : మండలంలోని ఉడేగోళం, వడ్రవన్నూరు, వీరాపురం, కొండాపురం గ్రామాలలోని 209 మంది రైతులకు  188 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సోమవారం పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ ఏవో మహేంద్ర తెలిపారు. 


శెట్టూరు : మండలంలోని యాటకల్లు, బొచ్చుపల్లి, ఆయ్యగార్లపల్లి, శెట్టూరు గ్రామాల రైతు భరోసా కేంద్రాల రైతులకు సోమవారం రా యితీ విత్తన వేరుశనగ పంపిణీ చేసినట్లు ఏఓ రాఘవేంద్ర తెలిపా రు. శెట్టూరులో 70 మంది రైతులకు 62 క్వింటాళ్లు, అయ్యగార్లపల్లి లో 90 మంది రైతులకు 81 క్వింటాళ్లు, బొచ్చుపల్లి 89 మంది రైతుల కు 80 క్వింటాళ్లు, యాటకల్లులో 204 మంది రైతులకు 181 క్వింటాళ్లు పంపిణీ చేశామన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు వీరన్న, కుమా ర్‌, భారతి, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


బ్రహ్మసముద్రం : మండలంలోని బ్రహ్మసముద్రం, పిల్లలపల్లి, బొమ్మగానిపల్లి, తీటకల్లు గ్రామ సర్పంచుల చేతుల మీదుగా విత్తన పంపిణీని ప్రారంభించినట్లు వ్యవసాయాధికారి పృథ్వీసాగర్‌ సోమవా రం తెలిపారు. కార్యక్రమంలో సింగల్‌విండో అధ్యక్షులు రామాంజినేయులు, రైతులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


గుమ్మఘట్ట : మండలంలోని భూపసముద్రం గ్రామ పంచాయతీలో సర్పంచ అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వ్యవసాయాధికారి రంగనేతాజీ అధ్యక్షతన విత్తన వేరుశనగ పంపిణీని సోమవారం ప్రారంభించారు.  తొలిరోజు పది మంది రైతులకు తొమ్మిది క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ చేసినట్లు తెలిపారు. 


తాడిపత్రి రూరల్‌ : మండలంలోని ఆలూరులో సోమవారం 26 మంది రైతులకు 23 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశామని ఏడీఏ చెంగళరాయుడు, ఏఓ మహితాకిరణ్‌ తెలిపారు. 


పామిడి : మండలలోని ఏడు రైతు భరోసా కేంద్రాలలో సోమవా రం రాయితీ వేరుశనగ విత్తన కాయల పంపిణీని మండల వ్యవసాయాధికారి లీనావసుంధర ప్రారంభించారు.పాళ్యం, పాళ్యంతండా, ఎ ద్దులపల్లి, రామగిరి, కండ్లపల్లి గ్రామాల రైతు భరోసా కేంద్రాల పరిధిలోని 357 మంది రైతులకు 321.3 క్వింటాళ్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓలు శ్రీనివాసరావు, శివరాజ్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T05:56:54+05:30 IST