Abn logo
Sep 19 2021 @ 00:48AM

రాష్ట్రంలో అరాచక పాలన

మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు

ముమ్మిడివరం, సెప్టెంబరు 18: అరాచక పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్‌ చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు డిమాండు చేశారు. ముమ్మిడివరం టీడీపీ కార్యాలయంలో శనివారం అర్దాని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో దాట్ల బుచ్చిబాబు ముఖ్యఅతిథిగా మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ వైసీపీ నాయకులను వెంటవేసుకుని చంద్రబాబును హతమార్చాలనే దురుద్ధేశంతోనే చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారన్నారు.  బీసీలు, ఎస్సీలు వైసీపీ వెంటే ఉన్నారని వైసీపీ నాయకులు సాగిస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. బీసీలంతా స్వర్గీయ ఎన్టీ రామారావు నుంచి టీడీపీ వైపే ఉన్నారన్నారు. 217జీవోతో ప్రభుత్వం మత్స్యకారుల జీవనప్రమాణాలకు తీవ్రనష్టం కలిగిస్తుంటే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించకపోవడం దారుణమన్నారు.  టీటీడీ బోర్డులో నేరచరిత్ర ఉన్నవారికి, కళంకితులకు స్థానం కల్పించి టీటీడీని అపవిత్రం చేస్తున్నారన్నారు.  రాష్ట్రఅధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్‌ మాట్లాడుతూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉగ్రవాదులుగా వ్యవహరించి రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారన్నారు. మేనల్లుడు, బావమరిదితో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇసుకమాఫియాను కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. పర్సంటేజీ ముట్టనిదే ఏఅభివృద్ధి పనులు ముందుకు సాగనివ్వడం లేదన్నారు. గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్‌, పొద్దోకు నారాయణరావు, దాట్ల బాబు, తాడి నరసింహారావు, పొత్తూరి విజయభాస్కరవర్మ, చిక్కాల అంజిబాబు, యాళ్ల ఉదయ్‌, దివి మహాలక్ష్మి, దాసరి నాగేశ్వరరావు, కడలి నాగు, ములపర్తి బాలకృష్ణ, బొక్కా రుక్మిణి, విళ్ల వీరాస్వామినాయుడు, అడబాల సతీష్‌, బొంతు నాగరాజు, కుంచనపల్లి నారాయణ, పాకలపాటి మురళి, రేకాడి రాంబాబు, కాశి లాజర్‌, కాశి మూర్తి, రంకిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.