కొత్త అనూభూతి కలిగే విధంగా లేజర్‌.. క్రాకర్‌ షో

ABN , First Publish Date - 2020-10-17T06:43:33+05:30 IST

జిల్లా ప్రజలకు కొత్త అనుభూతి కలిగించేలా బతుకమ్మ పండుగ సందర్భంగా లేజర్‌, క్రాకర్‌ షో ఏర్పాటు చేశామని రాష్ట్ర

కొత్త అనూభూతి కలిగే విధంగా లేజర్‌.. క్రాకర్‌ షో

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 16: జిల్లా ప్రజలకు కొత్త అనుభూతి కలిగించేలా బతుకమ్మ పండుగ సందర్భంగా లేజర్‌, క్రాకర్‌ షో ఏర్పాటు చేశామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన నగర మేయర్‌ వై.సునీల్‌రావు, డీసీపీ చంద్రమోహన్‌, ఏసీపీ అశోక్‌కుమార్‌, కార్పొరేటర్లు వి.రాజేందర్‌రావు, తోట రాములు, నాయకులు చల్ల హరిశంకర్‌, ఆనం ద్‌ తదితరులతో కలిసి హ్యాపీ సండే కార్యక్రమాలు, లేజర్‌, క్రాకర్‌ షో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇలాంటి ప్రదర్శన నిర్వహించలేదని చెప్పారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ఎల్‌ఎండీ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పాల్గొనాలన్నారు. 

Updated Date - 2020-10-17T06:43:33+05:30 IST