Abn logo
Sep 23 2021 @ 23:40PM

రాష్ట్ర విచ్ఛిన్నంతోపాటు అభివృద్ధి శూన్యం

ఎన్నికైన మండల కమిటీ అధ్యక్షులతో అశోక్‌రెడ్డి, పరిశీలకులు జయప్రకాశ్‌

టీడీపీ పరిశీలకులు జయప్రకాష్‌

గిద్దలూరు, సెప్టెంబరు 23 : రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర విచ్ఛిన్నంతోపాటు అభివృద్ధి శూన్యమని నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు జయప్రకాష్‌ నారాయణ చెప్పారు. స్థానిక విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే ము త్తుముల అశోక్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గంలోని టీడీపీ మండల కమిటీల ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు హాజరైన ఈ సమావేశంలో  జయప్రకా ష్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేత ల గొంతునొక్కడంతోపాటు దాడులు, అరెస్టులు వంటి దుశ్చర్యలతో అధికార పార్టీ బరితెగిస్తోందన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజలే వైసీపీ గొంతు నొక్కడం ఖాయమని హెచ్చరించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోదేనని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే,  ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడి లా పని చేయాలన్నారు. టీడీపీ గెలుపే లక్ష్యంగా ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను, పథకాల పేరుతో పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర రైతు కార్యదర్శి వి.వి.రాఘవరెడ్డి, పార్లమెంట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, అధికార ప్రతినిధి షేక్‌ మహబూబ్‌బాషా, కార్యదర్శి జీవనేశ్వర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు కేతం శ్రీను, రామలింగారెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలో అర్ధవీడు మండల కమిటీ మినహా మిగతా అన్ని మండలాల్లో అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర కమిటీ ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గిద్దలూరు పట్టణశాఖ అధ్యక్షుడిగా సయ్యద్‌వలి, మండల శాఖ అధ్యక్షుడిగా మార్తాల సుబ్బారెడ్డి, కొమరోలు మండల అధ్యక్షుడిగా గోనేని వెంకటేశ్వర్లు, రాచర్ల  మండల అధ్యక్షుడిగా కటికె యోగానంద్‌, కంభం మండలశాఖ అధ్యక్షుడిగా తోట శ్రీనివాసరావు, బేస్తవారపేట మండలశాఖ అధ్యక్షుడిగా సోరెడ్డి మోహన్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.