కొత్త జిల్లాలతో రాష్ట్రాభివృద్ధి

ABN , First Publish Date - 2022-01-27T05:39:03+05:30 IST

రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. నరసన్నపేటలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని బుధవారం ప్రారంభించారు.

కొత్త జిల్లాలతో రాష్ట్రాభివృద్ధి
అతిథి గృహాన్ని ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌


 డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ 

నరసన్నపేట, జనవరి 26: రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. నరసన్నపేటలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన వికేంద్రకరణకు దోహదపడుతుందన్నారు. కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఏమై నా లోపాలుంటే వాటిపై ఉగాది వారకు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని  శ్రీకా కుళం జిల్లాలో కొనసాగించాలని కొన్నాళ్ల కింద ట ప్రజాప్రతినిధులంతా సీఎం జగన్‌కు సూ చించారని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. పీఆర్సీ విషయంలో ఆందో ళన చేస్తున్న ఉద్యోగుల సమస్య చర్చిం చేందు కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి ఉద్యోగులు సహకరించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఎంపీపీ ఆరంగి మురళీ, జడ్పీటీసీ చింతు అన్నపూర్ణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పోన్నాన దాలినాయుడు, ఆర్‌ అండ్‌బీ ఈఈ సత్యనారాయణ, శంకరరావు, ఏఈ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-27T05:39:03+05:30 IST