Advertisement
Advertisement
Abn logo
Advertisement

మిల్లర్లతో కుమ్మక్కైన రాష్ట్ర ప్రభుత్వం

- డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

వెల్గటూర్‌, నవంబరు 26: రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ దుయ్యబట్టారు. శుక్రవా రం వెల్గటూర్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ మం త్రి కొప్పుల ఈశ్వర్‌ ఇప్పటి వరకు నియోజకవర్గంలోని ఒక్క వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దాఖలాలు లేవన్నారు. మిల్లర్లు కటింగ్‌ పేరుతో దోచుకుంటుంటే నియో జకవర్గం లోని 129 గ్రామాల రైతుల దీన పరిస్థితి పట్టడం లేదా? అని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలనే బాధ్య త ను ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రజ ల కష్టాలు ప్రభు త్వం దృష్టికి తేవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తే, కాంగ్రెస్‌ రాద్ధాంతం చేస్తుందని అనడం మీకే చెల్లిందన్నారు. కటింగ్‌ లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేసే వరకు కాంగ్రె స్‌ రైతుల పక్షాన పోరాడుతుందని హెచ్చరించారు. ప్రాజెక్టు ల పేరుతో నియోజకవర్గంలోని రైతుల భూములు తీసుకొ ని రైతుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్‌ మండలశాఖ అధ్యక్షుడు శైలేంధర్‌రెడ్డి, స ర్పంచ్‌ మేరుగు మురళి, సందీప్‌రెడ్డి, ఉదయ్‌, వెంకటస్వామి, నరేష్‌, శ్రీకాంత్‌రావు, వెంకటేష్‌, శ్రీధర్‌, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌  పాల్గొన్నారు. 


Advertisement
Advertisement