కరోనాను సమర్థంగా ఎదుర్కోవాలి

ABN , First Publish Date - 2020-06-04T09:22:28+05:30 IST

కరోనా వ్యాప్తిని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ జిల్లా అధికారులు, రెడ్‌క్రాస్‌ సంస్థ ..

కరోనాను సమర్థంగా ఎదుర్కోవాలి

రెడ్‌క్రాస్‌, కలెక్టర్‌ సేవలు హర్షణీయం

వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర గవర్నర్‌ హరిచందన్‌


కలెక్టరేట్‌: కరోనా వ్యాప్తిని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ జిల్లా అధికారులు, రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రతినిధులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ, కరోనా సమయంలో అధికార యం త్రాంగం బాగా పనిచేసిందని కొనియాడారు. రెడ్‌క్రాస్‌ సంస్థ అందించిన సేవలు  బాగున్నాయన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరింత ధైర్యంగా, చిత్తశుద్ధితో, అంకిత భావంతో పని చేయాలని సూచించారు. జిల్లాలో మంచి కార్యక్రమాలు అమలు చేసేందుకు ప్రణాళిక రూపిందించాలని పిలుపునిచ్చారు. జూనియర్‌ రెడ్‌క్రాస్‌ వంటీర్లను మరింత పెంచాలని సూచించారు. మండల స్థాయిలో రెడ్‌క్రాస్‌ ఉప శాఖలను నెలకొల్పాలని గవర్నర్‌ తెలిపారు.


గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ,  కరోనా కష్టకాలంలో కలెక్టర్‌ జె.నివాస్‌ స్వయంగా రక్తదానం చేసి మిగతా వారిలో ప్రేరణ కల్పించారని కొనియాడారు.  కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ, అన్ని మండలాల్లో రెడ్‌క్రాస్‌ సేవలు అందించినట్లు చెప్పారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవటం, శానిటైజేషన్‌ చేసుకోవడం వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచా మన్నారు.  రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు హోమియో మందులను పంపిణీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో 1.53 లక్షల మందికి, ఐదు వేలు మంది వలస  కార్మికులకు ఆహార పొట్లాలు అందించినట్లు చెప్పారు. అక్షయ పాత్ర సంస్థ సహాయం కూడా పొందినట్లు కలెక్టర్‌ తెలిపారు.  కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ పి. జగన్మోహన్‌రావు, సభ్యులు సుధాకర్‌, బి. మల్లేశ్వరరావు, ఎన్‌ అప్పన్న , పి. ఛైతన్య కుమార్‌ పి. శ్రీకాంత్‌, న్‌. సన్యాసిరావు, సూర్యారావు, సత్యనారాయణ, దాసుబాబు, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T09:22:28+05:30 IST