Abn logo
Sep 19 2021 @ 00:18AM

దేవుడా....! రాష్ట్రాన్ని నువ్వే కాపాడాలి

నవ గ్రహాలకు పూజలు నిర్వహిస్తున్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి


శనీశ్వరుడికి టీడీపీ నేత కోటంరెడ్డి పూజలు 

నెల్లూరురూరల్‌, సెప్టెంబరు 18 : ఆంధ్ర రాష్ట్రాన్ని, ప్రజలను దేవుడే కాపాడాలని కోరుతూ టీడీపీ నేత, నుడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి శని గ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం నెల్లూరురూరల్లోని కనుపర్తిపాడు వద్దనున్న సుబ్రమణేశ్వరస్వామి ఆలయంలో పూజలు జరిపారు.  ఆయన మాట్లాడుతూ ఏపీకి జగన్‌ ముఖ్యమంత్రిగా కాకుండా శనిలా దాపరించాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆరాచకాలను అరికట్టడానికి దేవుడే కిందకు దిగిరావాలన్నారు. ప్రస్తుత పరిస్థితులపై మంత్రులు, ఎమ్మెల్యేలు చెబితే వినే పరిస్థితుల్లో జగన్‌మోహన్‌రెడ్డి లేడని ఆరోపించారు. దేశానికి స్వతంత్య్రం వచ్చాక ప్రతిపక్ష నేత ఇంటిపై అధికార పక్షం దాడి చేయించిన దాఖలాలు లేవన్నారు. ఇలాంటి చరిత్ర కేవలం జగన్‌మోహన్‌రెడ్డికే సొంతమన్నారు. ఏపీలో గూండాలు, ఖూనీకోరులు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న సీఎం జగన్‌కు మంచి బుద్ది ప్రసాదించాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.