సింగరేణికి రాష్ట్రస్థాయి పురస్కారాలు

ABN , First Publish Date - 2022-04-22T05:46:32+05:30 IST

సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌)తో చేపడుతున్న అభివృద్ధి పనుల కార్యక్రమాలను పొందుపరుస్తూ రూపొందించిన లఘు చిత్రానికి రాష్ట్రస్థాయి పురస్కారం లభించిం ది.

సింగరేణికి రాష్ట్రస్థాయి పురస్కారాలు
మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న జీఎం సూర్యనారాయణ

గోదావరిఖని, ఏప్రిల్‌ 21: సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌)తో చేపడుతున్న అభివృద్ధి పనుల కార్యక్రమాలను పొందుపరుస్తూ రూపొందించిన లఘు చిత్రానికి రాష్ట్రస్థాయి పురస్కారం లభించిం ది. పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా(పీఆర్‌ఎస్‌ఐ) హైదరాబాద్‌ ఛాప్టర్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా గురువారం హైద్రాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ రిలేషన్స్‌ సదస్సులో పీఆర్‌ఎస్‌ఐ ఉత్తమ సీఎస్‌ఆర్‌ ఫిల్మ్‌ పురస్కారాన్ని సింగరేణి సంస్థకు ప్రదానం చేశారు. రాష్ట్ర ఎక్సైజ్‌, టూరిజంశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చేతుల మీదుగా సింగరేణి జీఎం(కోఆర్డినేషన్‌, చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌) సూర్యనారాయణ అందుకున్నారు. దక్షిణ భారతదేశ ఇంధన అవసరాలను తీర్చ డంతో పాటు కార్పొరేట్‌ సమాజిక బాధ్యతతో ఏటా 70 కోట్ల నిధులను సామాజిక అభివృద్ధికి సింగరేణి వెచ్చిస్తున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలన్నింటిని పొందుపరుస్తూ రూపొందించిన కార్పొరేట్‌ సీఎస్‌ఆర్‌ వీడియోను అవార్డుకు ఎంపికచేసినట్టు ప్రకటించారు. బెస్ట్‌మ్యాగజైన్‌ విభాగంలో సింగరేణి అద్భుత మ్యాగజైన్‌కు మొదటి బహుమతి లభించింది. ఈ మ్యాగజైన్‌లో సింగరేణి ఉద్యోగుల కోసం మాత్రమ కాకుండా పర్యావరణహితంగా సంస్థ చేపటిన్న సమగ్ర సమాచారాన్ని పొందుపరిచినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఉద్యోగులను ఉద్దేశిం చి ఎండీ ఇచ్చిన స్ఫూర్తిదాయక సందేశానికి బెస్ట్‌ మెసేజ్‌ ఆఫ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో అవార్డు లభించింది. సింగరేణివ్యాప్త సమాచారంతో పొందుపరిచిన సిం గరేణీయుల సమాచారం మ్యాగ్‌జైన్‌కు బెస్ట్‌కవర్‌ డిజైన్‌ విభాగంలో అవార్డు వచ్చిం ది. సంస్థ వ్యాపార విస్తరణ చర్యలు, అభివృద్ధి పనులను పొందుపరుస్తూ తయారు చేయబడిన బ్రోచర్‌కు బెస్ట్‌బ్రోచర్‌ అవార్డు, సీనియర్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ గనాశంకర్‌ పూజారికి లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రదానం చేశారు. ఈకార్యక్రమం లో పీఆర్‌ఎస్‌ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ అజిత్‌పాఠక్‌, సెక్రెటరీ జనరల్‌ వై బాబ్జీ, జాతీయ ఉపాధ్యక్షుడు యూఎస్‌ శర్మ, హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్మన్‌ డాక్టర్‌ పీ వేణుగోపాల్‌రెడ్డి, సింగరేణి చీఫ్‌లైజన్‌ ఆఫీసర్‌, పీఆర్‌వో మహేష్‌, సింగరేణి ప్రాంత క మ్యూనికేషన్‌ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-22T05:46:32+05:30 IST