క్రీడలతో మానసిక వికాసం

ABN , First Publish Date - 2021-10-18T04:55:31+05:30 IST

క్రీడలు శారీరక దారుఢ్యానికే కాకుండా మానసిక వికాసానికి దోహదపడతాయని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు

క్రీడలతో మానసిక వికాసం
విజేతలకు బహుమతి అందజేస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌

చిలకలూరిపేట టౌన్‌, అక్టోబరు 17: క్రీడలు శారీరక దారుఢ్యానికే కాకుండా మానసిక వికాసానికి దోహదపడతాయని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామంలో నిర్వహించిన 6వ స్టేల్‌ లెవల్‌ ఛాంపియన్‌షిప్‌ కబడ్డీ పోటీల బహుమతి ప్రదానోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ గెలుపోటములు సమానంగా స్వీకరించాలని సూచించారు. ఉదయం పోటీలను ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ సుభాని, సీపీఐ గ్రామ కార్యదర్శి కండిమళ్ల వెంకటేశ్వర్లు,  ఎంపీటీసీ బొంతా జ్యోతి, సీపీఐ గ్రామ నాయకులు సురభిరాజు, సౌటుపల్లి నాగేశ్వరరావు, షేక్‌ నన్నే, తంగిరాల జీవరత్నం ప్రారంభించారు. పోటీల్లో గుంటూరు జిల్లా జట్టు ప్రథమ, నెల్లూరు జిల్లా జట్టు ద్వితీయ స్థానాలను సాధించాయి.  


Updated Date - 2021-10-18T04:55:31+05:30 IST