రాష్ట్ర ఖజానా.. వైసీపీ ప్రభుత్వ బ్యాంకు కాదు: దేవినేని

ABN , First Publish Date - 2020-08-14T22:01:30+05:30 IST

రాజధాని తరలింపుపై హైకోర్టు స్టేటస్ కో కొనసాగించడం ప్రభుత్వానికి చెంపపెట్టని మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. కౌలుసొమ్ము చెల్లించకుండా

రాష్ట్ర ఖజానా.. వైసీపీ ప్రభుత్వ బ్యాంకు కాదు: దేవినేని

హైదరాబాద్: రాజధాని తరలింపుపై హైకోర్టు స్టేటస్ కో కొనసాగించడం ప్రభుత్వానికి చెంపపెట్టని మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. కౌలుసొమ్ము చెల్లించకుండా 29వేల రైతు కుటుంబాలను ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ఖజానా.. వైసీపీ ప్రభుత్వ బ్యాంకు కాదని, ఖజానా నుంచి అదనపు చెల్లింపులు సాంకేతిక పొరపాటని, సీఎఫ్ఎంఎస్ విభాగం చెప్పడం సిగ్గుచేటని తప్పుబట్టారు. జూలై 30న ఖజానా నుంచి రూ.1400కోట్లు పోతే 649 కోట్లని చెబుతున్నారని, జరిగిన పొరపాటుకు ఎవరు బాధ్యత తీసుకుంటారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. రమణారెడ్డి, శ్రీనివాసరావు అనే ఇద్దరు ప్రోగ్రామర్లు.. ఆర్థికశాఖ చెల్లింపుల్లో అంతా తామై వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమ దుయ్యబట్టారు.

Updated Date - 2020-08-14T22:01:30+05:30 IST