Abn logo
May 5 2021 @ 11:21AM

రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 44,631మందికి కరోనా..

               - బెంగళూరులో 20,870 పాజిటివ్‌ కేసులు


బెంగళూరు: రాష్ట్రంలో కరోనా కేసులు ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 44,631మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 20,870మందికి పాజిటివ్‌ సోకింది. మైసూరులో 2,293, హాసన్‌ 2278, తుమకూరు 1636, మండ్య 1506, బళ్ళారి 1280, ఉత్తరకన్నడ 822, శివమొగ్గ 803, రాయచూరు 817, బెంగళూరు గ్రామీణ 996మంది కాగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ 200-800 దాకా బాధితులు నమోదయ్యారు. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 16.90లక్షలకు పెరిగింది. బాధితుల సంఖ్య పెరిగినట్టుగానే కోలుకునేవారు క్రమేణా పెరిగారు. 24,714 మంది తాజాగా కోలుకోగా 12.10లక్షలమంది ఇప్పటివరకు డిశ్చార్జ్‌ అయ్యారు. 292మంది మృతి చెందగా 132మంది బెంగళూరులో మృతి చెందగా, బళ్ళారిలో 27, శివమొగ్గలో 15, తుమకూరులో 14, మైసూరులో 10 మంది మృతి చెందగా ఇతర జిల్లాల్లో పదిమందిలోపు ఉ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,64,363మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో బెంగళూరులోనే 3.01లక్షలమంది ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement