Home ministry : సాధారణ పరిస్థితుల తర్వాతే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్రహోదా : కేంద్ర హోంశాఖ

ABN , First Publish Date - 2021-07-29T00:05:00+05:30 IST

సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత, సరైన సమయంలో జమ్మూ కశ్మీర్‌కు ‘రాష్ట్ర హోదా’ ను ప్రకటిస్తామని

Home ministry :  సాధారణ పరిస్థితుల తర్వాతే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్రహోదా : కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ : సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత, సరైన సమయంలో జమ్మూ కశ్మీర్‌కు ‘రాష్ట్ర హోదా’ ను ప్రకటిస్తామని కేంద్రం పేర్కొంది. కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో రాత పూర్వకంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘‘సరైన సమయంలో జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తాం. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఈ దిశగా ఆలోచిస్తాం. భద్రత ప్రయోజనాల దృష్ట్యా కమ్యూనికేషన్ వ్యవస్థలపై తాత్కాలిక పరిమితులను విధించామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పరిమితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన చోట సడలింపులు కూడా చేస్తామని నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-07-29T00:05:00+05:30 IST