Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 5 2021 @ 15:36PM

పెట్రోల్ ధరలపై రాష్ట్రాలు ఆలోచించాలి: కేంద్ర మంత్రి నిర్మలా

న్యూఢిల్లీ: నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్ ధరలపై రాష్ట్రాలు కూడా ఆలోచించాలని, అవసరమైతే కేంద్రంతో చర్చలు చేయాలని ఆమె సూచించారు. పెట్రోల్‌పై కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా పన్నులు వేస్తున్నాయని అన్న ఆమె కేంద్ర రాష్ట్రాల మధ్య చర్చలు మంచి ఫలితాలు ఇవ్వవచ్చని ఆశించారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఐడబ్ల్యూపీసీ ప్రెసర్‌లో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘పెట్రోల్ ధరల పెరుగుదల అనేది కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఒక్క కేంద్ర ప్రభుత్వమే పన్నులు వేస్తోందని అనుకోవద్దు, రాష్ట్రాలు కూడా పెట్రోల్‌పై పన్నులు వేస్తున్నాయి. పెట్రోల్‌పై కేంద్రానికి వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం వెళ్తుంది. దీనిపై కేంద్ర రాష్ట్రాల మధ్య చర్చలు జరగడం అవసరం’’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement