Abn logo
Oct 22 2020 @ 03:31AM

ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం

Kaakateeya

తాళ్లరేవు: తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం లచ్చిపాలెం జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. ఈ ఘటనలో విగ్రహం కాళ్లు, చేతులు ధ్వంసమయ్యాయి. గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు డ్వాగ్‌ స్క్వాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.


Advertisement
Advertisement