ప్రజా వ్యతిరేక పాలన మానండి

ABN , First Publish Date - 2022-01-15T05:56:17+05:30 IST

ప్రభుత్వం రోజుకో ప్రజా వ్యతిరేక విధానాల తో కంటగింపుగా మారిందని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు పే ర్కొన్నారు.

ప్రజా వ్యతిరేక పాలన మానండి
ప్రభుత్వ జీవోల ప్రతులను భోగి మంటల్లో వేసి టీడీపీ నిరసన

గుంతకల్లు, జనవరి 14: ప్రభుత్వం రోజుకో ప్రజా వ్యతిరేక విధానాల తో కంటగింపుగా మారిందని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు పే ర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్‌కు చేరిన టీడీ పీ నాయకులు భోగి మంటలు వేసి ప్రభుత్వానికి, జగనకు వ్యతిరేకంగా ని నాదాలు చేశారు. భోగి మంటల్లో నెంబర్‌ 196 జీవో ప్రతులను వేసి తగులబెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తోందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో తీరని నష్టం కలిగిస్తోందని విమర్శించారు. ఓటీఎస్‌, చెత్త ప న్ను పేరిట జనాన్ని దోచుకుంటున్నాని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరు ప్ర భుత్వ బాధితులవుతున్నారని తెలియజేశారు. సమర్థవంతంగా పరిపాలన చేయలేక, ఇచ్చిన హామీ ఒక్కదాన్నీ నెరవేర్చలేక జగన చతికిలబడ్డాడన్నా రు. ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, వైసీపీ కార్యకర్త లు దౌర్జన్యాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు.


చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్నిరకాల ధరలూ అదుపులో ఉన్నాయన్నారు. జగన పరిపాలనలో నిత్యావసర వస్తువులు, భవన నిర్మాణ సామగ్రి, ఇంధన ధరలు ఆకాశాన్నంటాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు తమ కుటుంబాలను పోషించుకోలే క అష్టకష్టాలు అనుభవిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజాగ్రహం కట్ట లు తెంచుకుని జగనను ముంచేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మనూరు వెంకటేశులు, కార్యదర్శి ఆటో ఖాజా, కౌన్సిలరు గుడిపాటి ఆం జనేయులు, ఎస్సీ సెల్‌ నాయకుడు జింకల జగన్నాథ్‌, మాజీ ఎంపీటీసీ స భ్యుడు తలారి మస్తానప్ప, మాజీ కౌన్సిలర్‌ హనుమంతు, నాయకులు లక్ష్మ య్య యాదవ్‌, బీ రాము, పోతప్పగారి శీన, చికెన జగన, రామన్న చౌదరి, ఫజులు పాల్గొన్నారు. 


ప్రజావ్యతిరేక జీవోలతో అధ్వానపు పాలన

కళ్యాణదుర్గం: ప్రజావ్యతిరేక జీవోలతో వైసీపీ ప్రభుత్వ పాలన అధ్వా నంగా మారిందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయు డు ధ్వజమెత్తారు. శుక్రవారం వేకువజామున స్థానిక ఎన్టీఆర్‌ భవన వద్ద భోగి మంటలు వేసి, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రజా వ్యతిరేక జీవో ప్ర తులను నాయకులు దహనం చేసి నిరసన వ్యక్తంచేశారు. అనంతరం నా యకులు మాట్లాడుతూ విచ్చలవిడిగా నిత్యావసర ధరలు పెంచి ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు.సంక్రాంతి పండుగను కూడా సంతోషం గా జరుపుకోలేని స్థితిలో ప్రజలు వున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్రాంతి కానుకలు అందజేసి, సంబరాలు జరుపుకునేందుకు సహకరించిందన్నారు. ప్రస్తుత దౌర్భగ్య పాలనలో ప్రజలకు అష్టకష్టాలు తప్పా ఎ లాంటి సంతోషాలు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే సంక్రాంతి నాటికి ప్రభుత్వం కుప్పకూలక తప్పదని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో నాయకు లు దొడగట్ట నారాయణ, మురళి, తలారి సత్యప్ప, నాగరాజు, విరుపాక్షి, కిష్ట ప్ప, హనుమంతరాయుడు, మొద్దుల వెంకటేష్‌, బిక్కి గోవిందరాజులు, తి మ్మప్ప, మంజునాథ్‌, మనోహర్‌, రాజశేఖర్‌, రమేష్‌, సుధాకర్‌, హరి, మనోజ్‌ పాల్గొన్నారు. 


సీఐటీయూ ఆధ్వర్యంలో...

రాయదుర్గం: మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు ఎన్నికల ముందు పాదయాత్రలో జగన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసి స్తూ శుక్రవారం స్థానికంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తె ల్లవారుజామున  ప్రభుత్వ హామీ పత్రాల ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చారు. పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద విధులకు హాజరైన కార్మికు లు ప్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తంచేశారు. అనంతరం భోగి మంటలను వెలిగించి హామీ పత్రాలను కాల్చారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా క మిటీ సభ్యులు మల్లికార్జున మాట్లాడుతూ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జగన ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. మాట తప్పం.. మడమ తిప్పం అని చెప్పుకునే ముఖ్యమంత్రి, మున్సిపల్‌ కార్మికుల విషయంలో మీరు చేసిందేమని ప్రశ్నించారు. 11వ పీఆర్సీని ము న్సిపల్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన నాయకు లు తిప్పేస్వామి, నాగరాజు, మల్లేష్‌, రాము, వన్నూరుస్వామి, బసవరాజు  పాల్గొన్నారు. 


బీజేపీ ఆధ్వర్యంలో...

రాయదుర్గం: మూడేళ్లుగా హిందువులపై దాడులు జరుగుతున్నా ప్ర భుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురా లు జింకా వసుంధర విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని ఒకటో వార్డు లో భోగి మంటలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ  నిరసన వ్యక్తంచేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకిస్తూ భోగి మంటల ముందు ప్రభుత్వానికి సద్బుద్ధి ఇవ్వాలని ప్రార్థించామన్నారు. కార్యక్రమంలో నాయకులు వాడె అంబోజీరావు, శివశంకర్‌, నాని, కాంబ్లి తిప్పయ్య, నాగరాజు, ఆంజనేయులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-15T05:56:17+05:30 IST