ఆ యాప్స్‌కి దూరంగా ఉండాలా?

ABN , First Publish Date - 2020-10-17T05:30:00+05:30 IST

మీరు కీబోర్డ్‌ అప్లికేషన్స్‌ డౌన్లోడ్‌ చేసినప్పుడు సహజంగా కనిపించే వార్నింగ్‌ ఇది. కేవలం ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం ముందు జాగ్రత్తగా చూపించే వార్నింగ్‌ మెసేజ్‌ మాత్రమే ఇది.

ఆ యాప్స్‌కి దూరంగా ఉండాలా?

ఫోన్లో కీబోర్డ్‌ అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసేటప్పుడు ఫలానా అప్లికేషన్‌ డేటా కలెక్ట్‌ చేస్తుంది అని వార్నింగ్‌ మెసేజ్‌ కనిపిస్తోంది. అలాంటి ఆప్స్‌కి దూరంగా ఉండాలా? 

- సాయితేజ, విజయవాడ



మీరు కీబోర్డ్‌ అప్లికేషన్స్‌  డౌన్లోడ్‌ చేసినప్పుడు సహజంగా కనిపించే వార్నింగ్‌ ఇది. కేవలం ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం ముందు జాగ్రత్తగా చూపించే వార్నింగ్‌ మెసేజ్‌ మాత్రమే ఇది. సహజంగా ఒక వర్చువల్‌ కీబోర్డ్‌ అప్లికేషన్‌ ద్వారా మీరు యూసర్‌ నేమ్‌ లేదా పాస్వర్డ్‌లు అలాగే డెబిట్‌ క్రెడిట్‌ కార్డు నంబర్లు టైప్‌ చేస్తారు. ఆప్పుడు ఆ కీబోర్డ్‌ అప్లికేషన్‌ వాటిని నిర్దిష్టమైన బ్యాంకింగ్‌ లేదా ఫేస్‌ బుక్‌ వంటి అప్లికేషన్లకు చేరవేస్తుంది.

అంటే పరోక్షంగా మీరు ఎంటర్‌ చేసే డేటా మొత్తం కచ్చితంగా కీబోర్డ్‌ అప్లికేషన్‌ దగ్గర ఉంటుంది. అయితే అధికశాతం కీబోర్డ్‌ అప్లికేషన్స్‌ మన డేటాను దుర్వినియోగం చేయవు.  కేవలం అతికొద్ది ప్రమాదకరమైన అప్లికేషన్స్‌ మాత్రమే మన డేటాను వాడుకుంటాయి. కాబట్టి కీబోర్డ్‌ అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసేటప్పుడు బాగా పాపులర్‌ అయిన యాప్స్‌ మాత్రమే వాడాలి. అంతే తప్ప కనిపించిన ప్రతీ దాన్ని డౌన్లోడ్‌ చేయొద్దు.


Updated Date - 2020-10-17T05:30:00+05:30 IST