హామీదారుకు దివాలా నోటీసులపై స్టే

ABN , First Publish Date - 2020-09-24T09:22:54+05:30 IST

హామీదారుకు దివాలా నోటీసులపై స్టే

హామీదారుకు దివాలా నోటీసులపై స్టే

కార్పొరేట్‌ రుణగ్రహీతలు, హమీదారులకు సంబంధించి దివాలా ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతిస్తున్న దివాలా కోడ్‌ నిబంధనలను సవాల్‌ చేస్తూ సబ్బినేని సురేంద్ర అనే వ్యాపారి హైకోర్టును ఆశ్రయించారు. దివాలా కోడ్‌లోని సెక్షన్‌ 95, 96, 97, 99, 100, 101 ప్రకారం కార్పొరేట్‌ మంత్రిత్వశాఖ 2019 నవంబరు 15న జారీ చేసిన నోటిఫికేషన్‌ను, తదనుగుణంగా 2020 ఆగస్టు 19 న ఎస్‌బీఐ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని పిటిషన్‌లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పిటిషనర్‌కు ఎస్‌బీఐ జారీ చేసిన నోటీసులను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2020-09-24T09:22:54+05:30 IST