దేశ రాజధాని ఢిల్లీకి చేరిన స్టీల్ ప్లాంట్ నిరసన సెగలు

ABN , First Publish Date - 2021-08-02T18:40:04+05:30 IST

విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటాన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు ఢిల్లీకి తీసుకువెళ్లాయి.

దేశ రాజధాని ఢిల్లీకి చేరిన స్టీల్ ప్లాంట్ నిరసన సెగలు

విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటాన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు ఢిల్లీకి తీసుకువెళ్లాయి. సోమ, మంగళవారం జంతర్‌మంతర్, ఏపీ భవన్ దగ్గర ఆందోళన చేయాలని సంఘాల నేతలు నిర్ణయించారు. ఈ ధర్నాలో పార్టీల ఎంపీలు, నేతలు కూడా పాల్గొంటారు. అయితే నిరసన ప్రదర్శన చేయడానికి వచ్చిన స్టీల్ ప్లాంట్ సిబ్బందిని ఢిల్లీ పోలీసులు అడ్డుకుంటున్నారు. న్యూ రైల్వే స్టేషన్‌లోనే రెండున్నర గంటలు నిర్బంధించారు. జంతర్ మంతర్‌కు ఆటోలో వెళుతున్నవారిని కూడా అడ్డుకున్నారు. అంతేకాకుండా పోలీసులు వారిని బెదిరిస్తున్నారు.


ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులను అరెస్టు చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. నెల రోజుల ముందు ఢిల్లీలో హోటల్‌లో గదులు బుక్ చేసుకున్న వారిని కూడా బలవంతంగా క్యాన్సిల్ చేయిస్తున్నారు. అయినప్పటికీ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని, అమ్మకాన్ని అడ్డుకునేందుకు ప్రాణాలు ఇచ్చేందేకు కూడా సిద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్య రామయ్య ప్రకటించారు.

Updated Date - 2021-08-02T18:40:04+05:30 IST