31న ఉక్కు కార్మికుల సమ్మె

ABN , First Publish Date - 2022-01-19T06:17:10+05:30 IST

నూతన వేతనాలు అమలు, ఎరియర్స్‌ చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 31న సమ్మె చేయనున్నట్టు స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌కు మంగళవారం అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు నోటీసు అందజేశారు.

31న ఉక్కు కార్మికుల సమ్మె
ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌కు నోటీసు అందజేస్తున్న అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు

సీఎండీకి సమ్మె నోటీసు అందజేత

నూతన వేతనాల చెల్లింపులో జాప్యంపై నిరసన


ఉక్కుటౌన్‌షిప్‌, జనవరి 18: నూతన వేతనాలు అమలు, ఎరియర్స్‌ చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 31న సమ్మె చేయనున్నట్టు స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌కు మంగళవారం అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు నోటీసు అందజేశారు. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)లో నూతన వేతనాలు చెల్లిస్తున్నారని, కానీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మాత్రం అమలు చేయడం లేదని నోటీసులో పేర్కొన్నారు. నూతన వేతనాల కోసం ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నామని, అయినప్పటికీ ఉద్యోగులకు న్యాయం జరగలేదన్నారు. నోటీసు ఇచ్చిన వారిలో  కార్మిక సంఘాల  నాయకులు జె.అయోధ్యరామ్‌ (సీఐటీయూ), గంధం వెంకటరావు (ఇంటక్‌), కేఎస్‌ఎన్‌ రావు (ఏఐటీయూసీ), జి.గణపతిరెడ్డి (హెచ్‌ఎంఎస్‌), వై.మస్తానప్ప (వైఎస్సార్‌టీయూసీ), కె.సత్యారావు (టీఎన్‌టీయూసీ), డి.సురేశ్‌బాబు (సీఎఫ్‌టీయూఐ), డీవీ రమణారెడ్డి (డీవీఆర్‌ఈఎస్‌యూ), సీహెచ్‌.సన్యాసిరావు (ఏఐసీటీయూ), కె.రామ్‌కుమార్‌ (వీఎస్‌ఈయూ), వరసాల శ్రీనివాసరావు (జేఎంఎస్‌), టి.జగదీశ్‌ (వీఎస్‌ఎంఎస్‌), బి.డేవిడ్‌ (వీఎస్‌ఈయూ), కె.పరంధామయ్య (యూఎస్‌ఈ) తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-01-19T06:17:10+05:30 IST