‘స్టెప్‌’ అప్‌

ABN , First Publish Date - 2020-05-13T06:27:42+05:30 IST

ఎప్పుడూ ఒకటే రకం వర్కవుట్లంటే బోర్‌ కొట్టవచ్చు. ఈసారి కాస్త భిన్నంగా చేద్దాం. ఇంట్లోనే మెట్లపై సులువుగా చేసుకొనే ఈ వ్యాయామంతో ఫిట్‌నెస్‌తో పాటు చురుకుదనం కూడా...

‘స్టెప్‌’ అప్‌

ఎప్పుడూ ఒకటే రకం వర్కవుట్లంటే బోర్‌ కొట్టవచ్చు. ఈసారి కాస్త భిన్నంగా చేద్దాం. ఇంట్లోనే మెట్లపై సులువుగా చేసుకొనే ఈ వ్యాయామంతో ఫిట్‌నెస్‌తో పాటు చురుకుదనం కూడా పెరుగుతుంది. 


మొదటి మెట్టుతో..: మీ పాదాల మధ్య భుజాలంత దూరం పెట్టి, మొదటి మెట్టుపై నిల్చోండి. మోకాళ్లు వంచి, చేతులు ముందుకు, వెనక్కు ఊపుతూ రెండు మెట్లు పైకి దూకండి. ఇలాగే మెట్ల చివర వరకు వెళ్లండి. 10 నిమిషాల్లో ఎన్ని సాధ్యమైతే అన్ని చేయండి. 



రివర్స్‌లో..: రెండో మెట్టుపై నిలబడండి. కుడి కాలిని బెండ్‌ చేసి, ఎడమ కాలిని వెనక్కు చాచండి. ఎడమ కాలి మునివేళ్లు నేలపై పెట్టి, మీ శరీరాన్ని బ్యాలెన్స్‌ చేయాలి. నడుము పై భాగం నిటారుగా ఉంచి, పొట్ట బిగించండి. ఇప్పుడు ఎడమ కాలిని ముందుకు తెచ్చి, ఇదే విధంగా 10-15సార్లు చేయండి. 



మళ్లీ మొదటికి..: 1, 2 ఎక్స్‌ర్‌సైజ్‌లు అయిన తరువాత, ఒక మెట్టు పైకి వెళ్లండి. ఇప్పుడు రెండు మెట్లు వెనక్కు దూకండి. ల్యాండింగ్‌ సాఫ్ట్‌గా ఉండాలి. ఇలా చేయగలిగినన్నిసార్లు చేయండి. 

Updated Date - 2020-05-13T06:27:42+05:30 IST