ఓటు హక్కు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-06-20T04:26:12+05:30 IST

పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పు ల ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.

ఓటు హక్కు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలి
వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 19: పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పు ల ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. 2020-21 ఆర్థిక సం వత్సరంలో ఎన్నికల ఖర్చులకు సంబంధించి పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ భారతి హొళికేరి మాట్లాడుతూ జిల్లాలో నూతన ఓటర్ల ప్రక్రియ జరుగుతుందని, దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని ధ్రువీకరిస్తున్నామన్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీఓలు వేణు, శ్యామలాదేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-20T04:26:12+05:30 IST