Abn logo
Oct 14 2021 @ 22:59PM

సారా రహిత గ్రామాలే లక్ష్యం

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 14: జిల్లాలో సారా నిర్మూలనకు  చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌తో కలసి గురువారం కలెక్టరేట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ రెవెన్యూ మొబలైజేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సారా రహిత గ్రామాలే లక్ష్యంగా అధికారులు పని చేయాలన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో సారా తయారీ స్థావరాలపై దాడులు చేయాలని ఆదేశించారు. సారా రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని సూచించారు.  సముద్ర మార్గం ద్వారా తరలించకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. అటవీ శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ ఏజెన్సీ ప్రాంతాల్లో సారా తయారీ స్థావరాలను గుర్తించాలని తెలిపారు. బెల్లపు ఊటలను ధ్వంసం చేయాలని ఆదేశించారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో ప్రేరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తద్వారా సారా నిర్మూలనకు గిరిజనుల్లో చైతన్యం తీసుకొస్తున్నట్లు చెప్పారు. ‘తీరప్రాంతాల ప్రజలతో మమేకమై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. సముద్రమార్గంలో కూడా రవాణాను అడ్డుకుంటున్నాం. జిల్లాలో సరిహద్దు ప్రాంతాలు, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలి. ఇప్పటికే పలువురు సారా విక్రయదారులపై బైండోవర్‌ కేసులు నమోదు చేశాం. ఆంరఽఽధ, ఒడిశా పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెవెన్యూ శాఖల సమన్వయంతో జాయింట్‌ ఆపరేషన్లు నిర్వహిస్తుండాలి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను నియంత్రించాలి’ అని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జాయింట్‌ డైరక్టర్‌ శ్రీనివాసరావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ యేసుదాసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.