Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరి వైపే అడుగులు

ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రతికూల పరిస్థితులు

ఆరుతడికి భూములు అనుకూలం కాదంటున్న రైతాంగం

సన్నాలు సాగు చేయడానికి ఆసక్తి

కొరవడిన అవగాహన

జగిత్యాల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క వరి సాగు వద్దని చెపుతున్నా...యాసంగి పంటకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని ముందస్తుగా హెచ్చరిస్తున్నా...మరో వైపు వ్యవసాయ శాఖ అధికారులు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ రైతులు పలువురు వరి సాగు వైపే దృష్టి సారిస్తు న్నారు. వరి ప్రత్యామ్నాయంగా అధికారులు సూచిస్తున్న పంటల సాగు పై రైతులు అనాసక్తి కనబరుస్తున్నారు. దీని ఫలితంగా జిల్లాలో ఇప్పటికే చాల మండలాల్లో రైతులు వరి నాట్లు వేయడానికి అడుగులు వేస్తున్నా రు. కొన్ని చోట్ల సన్నరకాలు, మరికొన్ని చోట్ల ఒప్పందాలు కుదుర్చుకుం టున్నారు. మొత్తం మీద వరి స్థానంలో మళ్లీ వరి సాగు చేయడానికే రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గత యేడాదితో పోలిస్తే వరి సాగు తగ్గుతుందని అంటున్నారు. 


వరి సాగుకు ప్రధాన కారణాలివే...

జిల్లాలో గత యాసంగిలో పంటల సాగు గణనీయంగా పెరిగింది. జి ల్లాలో గత యేడాది అన్ని పంటల సాగు విస్తీర్ణం 3.16 లక్షల ఎకరా లు గా ఉంది. అధికారుల అంచనా కంటే 162 శాతం అధికంగా పంటల సాగు జరిగింది. గత యాసంగిలో జిల్లాలో 1,99,081 మంది రైతులు 3,16,390 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. ఇందులో అత్యధికం గా పలు మండలాల్లో 1,52,076 మంది రైతులు 2,77,350 ఎకరాల్లో వరి పంటను సాగు చేసారు. ప్రస్తుత యేడాది జిల్లాలో యాసంగిలో వరి  వైపు రైతులు మొగ్గు చూపడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. అం దులో ప్రధానంగా జిల్లాలోని చెరువులు, కాలువల కింద ఉన్న భూము లు వరి సాగుకే అనుకూలంగా ఉన్నాయి. వేరే భూములున్నప్పటికీ వాటి ని ఉన్నంట్లుండి ఆరుతడి వైపు మార్చడం అంత త్వరంగా సాధ్యపడక పోవచ్చన్న అభిప్రాయాలున్నాయి. మినుములు, పెసర్లు వంటి పంట ది గుబడులతో పాటు మద్దతు ధర తక్కువగా ఉండడం కారణమవుతోం ది. జిల్లాలో ఏకైక వ్యవసాయాధారిత పరిశ్రమైన ముత్యంపేట చక్కర క ర్మాగారం లేఆఫ్‌లో ఉండడం వల్ల చెరుకు సాగును రైతులు మానుకు న్నారు. అదేవిధంగా మొక్కజొన్న సాగు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కొను గోలు కేంద్రాలు తెరవకపోవడం, దళారులు, లైసెన్స్‌ లేని వ్యాపారులకు తక్కువ ధరలకు మొక్కజొన్నను విక్రయించాల్సి రావడం వల్ల అటువైపు ఇష్టపడడం లేదు. వానాకాలంలో వరి వేసిన భూమిలో ఇప్పటికే అధిక తేమ ఉంటోంది. మొదటి తడి అందించగానే నీరు అధికంగా నిలిచి విత్త నాలు మొలకెత్తే అవకాశాలు తక్కువగా ఉంటాయని రైతులు భావిస్తు న్నారు. దీనికి తోడు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయా తదితర వా టికి అడవి పందులు, కోతులు, చిలుకల బెడద ఎక్కువగా ఉండడం సైతం కారణాలుగా మారుతున్నాయి. ఆరుతడి పంట ఉత్పత్తుల కొనుగో ళ్లకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం, సరైన విధంగా మార్కె టింగ్‌ సౌకర్యం లేకపోవడం రైతులు వెనుకంజవేస్తున్నారు. ఆయా పంట లకు కలుపు, చీడ పీడలు, తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండడం, నిరంతర పర్యవేక్షణ అవసరముండడం సైతం రైతులను ఆలోచింపజేస్తోంది. కొన్ని సీజన్లుగా వరిసాగుకు అలవాటుపడిన రైతులు వీటన్నింటిని ఎదుర్కొనేం దుకు సిద్ధంగా లేక మళ్లీ వరికే మొగ్గు చూపుతూ అటు వైపు దృష్టి సారిస్తున్నారు. 


ఎస్సారెస్పీ సాగునీటి ప్రణాళిక ఖరారు...

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో యాసంగిలో జిల్లాలో సాగు నీటి ప్ర ణాళికను అధికారులు, ప్రజాప్రతినిధులు ఖరారు చేశారు. మూడు రోజు ల క్రితం నిజామాబాద్‌లో జరిగిన నీటి పారుదల సలహా బోర్డు సమావే శంలో ఎస్సారెస్పీ సాగునీటి ప్రణాళికను ప్రకటించారు. కాకతీయ కాలువ ద్వారా సాగుకు నీటిని అందించడానికి నిర్ణయించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేయడానికి నిర్ణయించారు. డి సెంబరు 25వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు ఈ ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో పు ష్పలంగా నీటి నిల్వ ఉంది. దీంతో ప్రాజెక్టు నుంచి యాసంగిలో 4.50 టీ ఎంసీల నీటిని పంటల కోసం వినియోగించడానికి నిర్ణయించారు. ఎస్సా రెస్పీ నీరు సైతం ఆశించిన స్థాయిలో అందుతుండడంతో యాసంగిలో సాగునీటి సమస్య తలెత్తే అవకాశాలు లేకుండా పోతున్నట్లు రైతులు ఆ లోచిస్తున్నారు. 

సన్నాల వైపు దృష్టి....

జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు సన్నరకాల వరి సాగుపై దృష్టి పెడుతున్నారు. సన్న రకాలకు డిమాండ్‌ ఉండడంతో మిల్లర్లతో ఒప్పందా లు కుదుర్చుకొని సాగు చేయడంపై ఆలోచన చేస్తున్నారు. ఆరుతడి పంటలు సాగు చేయాలంటే నవంబరు, డిసెంబరు నెలలే అనుకూలంగా ఉంటాయని అంటున్నారు. వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని కొన్ని రోజులుగా ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. యాసంగిలో ప్రభుత్వం వరి వద్దన్నా మ రో అవకాశం లేని ప్రాంతాల్లో ఎక్కువ మంది వరి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. అయితే దొడ్డు రకాలకన్న, సన్న రకాలనే ఎంపిక చేసుకో వడంపై దృష్టి సారిస్తున్నారు. ఎక్కువ మంది మిల్లర్లు సన్న రకాలను కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు రైతులు భావిస్తున్నారు. కొ న్ని రకాలకు మద్దతు ధరకు మించి రూ. 2,300 వరకు క్వింటాలుకు ధర పెట్టి కొనుగోలు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. 

వ్యవసాయ అధికారుల విస్తృత ప్రచారం...

జిల్లాలో ప్రస్తుత యాసంగిలో వరి సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వరికి బదులుగా ఇ తర పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల వివరాలను రైతులకు తెలియపరుస్తున్నారు. యాసంగిలో వరి సాగు చేసి నట్లయితే పంట ఉత్పత్తి మార్కెటింగ్‌ సమస్య తలెత్తుతుందని వివరిస్తు న్నారు. ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేసే పరిస్థితి లేనందున రైతులు ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలని వివరిస్తున్నారు. పల్లె ల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తూ రైతులను చైతన్య పరచడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో, రైతులు వరి వైపు ఏ మేరకు మొగ్గు చూపుతారో...ప్రత్యామ్నయ పంటలు రైతులకు ప్రయోజనం ఎంత వరకు కలిగిస్తాయోనన్న చర్చలు రైతాంగంలో చోటుచేసుకుంటున్నాయి.


Advertisement
Advertisement