అర్థం తెలియకపోతే, అడుగులు తడబడతాయి!

ABN , First Publish Date - 2020-02-13T05:01:06+05:30 IST

విద్యాసంవత్సరం మొదలైన ఏడాదికాలంగా చదువుతూనే ఉండవచ్చు. అంత మాత్రాన ప్రతి విద్యార్థీ పాఠ్యాంశాల్లోని ప్రతి పదానికీ అర్థం తెలిసి ఉంటారని కాదు. ఎక్కువ పదాలు తెలిసినవే అయినా అక్కడక్కడ కొన్ని తెలియని పదాలు కూడా ఉంటాయి.

అర్థం తెలియకపోతే, అడుగులు తడబడతాయి!

విద్యాసంవత్సరం మొదలైన ఏడాదికాలంగా చదువుతూనే ఉండవచ్చు. అంత మాత్రాన ప్రతి విద్యార్థీ పాఠ్యాంశాల్లోని ప్రతి పదానికీ అర్థం తెలిసి ఉంటారని కాదు. ఎక్కువ పదాలు తెలిసినవే అయినా అక్కడక్కడ కొన్ని తెలియని పదాలు కూడా ఉంటాయి. అయితే కొంత మంది పిల్లలు తెలియని పదాలకు ఊహాత్మకమైన అర్థాలను జోడించి దొర్లించుకుపోతూనే ఉంటారు. ఏదో బద్దకంతో ఎప్పటికప్పుడు ఆయా  పదాల్ని దగ్గర దాటేసుకుపోతున్నా, కంట్లో నలుసులా, పంటికింద రాయిలా ఒక్కో పదం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందువల్ల తెలియని పదాల దగ్గర నిరంతరం దాటవేసే ప్రయత్నం చేయకుండా, అవసరమైనప్పుడు  నిఘంటువును తిరగేయడమే మేలు. తెలియని పదాలతో కలిగే మరో నష్టం ఏమిటంటే, చదివే వేగం బాగా తగ్గిపోతుంది. పదాలకు  సరియైున అర్థం తెలియకుండానే ఆన్సర్‌ చేసే ప్రయత్నంలో విషయం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది.  పైగా, తెలిసీ తెలియని అవగాహనతో ఆన్సర్‌ చేయడంలో ఒక ఆత్మన్యూనతా భావం కలుగుతుంది. ప్రతి పదానికీ అర్థం తెలిసినప్పుడు రాసే వేగం పెరగడమే కాదు. విషయాన్ని విశ్లేషించడంలో ఒక కొత్త శక్తి పుట్టుకొస్తుంది. నిజానికి ఈ ప్రయత్నం అంతకు ముందెప్పుడో అంటే కొత్త పదం చెవిలోనో, కంట్లోనో పడ్డప్పుడే చేయాలి. పరీక్షల రోజుల్లో  నిఘంటువు వెదుక్కోవడం వల్ల సమయం వృఽధా అయిపోతుంది కదా అనిపించవచ్చు. కానీ, పదాలకు అర్థం తెలియక,  చదివే వేగం బాగా తగ్గిపోవడంతో వృధా అయ్యే సమయం కూడా తక్కువేమీ కాదు. అందువల్ల తెలియని పదాలు కొరకరాని కొయ్యల్లా వేఽధిస్తాయనే నిజాన్ని పిల్లలకు అర్థం అయ్యేలా తలితండ్రులు చెప్పాలి. 

Updated Date - 2020-02-13T05:01:06+05:30 IST