తన ఇంటిని అద్దెకి ఇచ్చిన స్మిత్.. వారానికి అద్దె ఎంతంటే..

ABN , First Publish Date - 2020-02-22T02:49:12+05:30 IST

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన విలాసవంతమైన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. 2015లో 2 మిలియన్ డాలర్లు వెచ్చించి.. సిడ్నీలో మూడు బెడ్‌రూంలో,

తన ఇంటిని అద్దెకి ఇచ్చిన స్మిత్.. వారానికి అద్దె ఎంతంటే..

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన విలాసవంతమైన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. 2015లో 2 మిలియన్ డాలర్లు వెచ్చించి.. సిడ్నీలో మూడు బెడ్‌రూంలో, బాత్ రూంలతో కూడిన ఈ ఇంటిని అతను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత తన ఇష్టానుసారంగా ఇంటిలో మార్పులు చేశాడు. అయితే ఇప్పుడు స్మిత్ ఈ ఇంటిని వారానికి అక్షరాలా 2వేల డాలర్లకు అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. 


ఈ విలాసవంతమైన ఇంటిని నలుపు, గోధుమ రంగుల కలయికతో స్మిత్ అలంకరించాడు. ఇందులో ఓపెన్ కిచెన్‌తో పాటు.. ఓపెన్ డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. లామినేటెడ్ ఫ్లోరింగ్‌తో ఉన్న ఈ ఇంటిలో పెద్ద స్లైడింగ్ డోర్లను అమర్చారు. తద్వారా లాంగ్‌లోకి సూర్యురశ్మి ప్రవేశిస్తుంది. అంతేకాక ఈ ఇంటిలోని ప్రతి గది నుంచి సిడ్నీలో ప్రతిష్టాత్మక కట్టడం హార్బర్ బ్రిడ్జిని చూడొచ్చు. 


అయితే స్మిత్‌కు ఇది ఒకటే విలాసవంతమైన ఇల్లు కాదు. మారిక్‌విల్లేలో, సాన్ సౌచీలో, బ్రిచ్‌గ్రోవ్‌లోనూ స్మిత్‌కి విలాసవంతమైన ఇల్లు ఉన్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. 2018లో స్మిత్ తన ఇంటిని 250 డాలర్లుకు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. 2019లో అతను పది డాలర్లు పెంచాడు. కానీ, 2020లో అదే ఇంటికి ఏకంగా వారానికి 2వేల డాలర్ల అద్దె రావడం గమనార్హం.

Updated Date - 2020-02-22T02:49:12+05:30 IST