Abn logo
May 3 2021 @ 15:49PM

ఇక, వార్నర్‌ను సన్‌రైజర్స్ జెర్సీలో చూడలేం: స్టెయిన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు, ఆ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు మధ్య తెర వెనుక ఏదో జరుగుతోందని దక్షిణాఫ్రికా బౌలర్ డెయిల్ స్టెయిన్ సందేహం వ్యక్తం చేశాడు. స్టెయిన్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున వార్నర్ సారథ్యంలో ఆడాడు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వార్నర్ ఇకపై ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఆడడేమోనని స్టెయిన్ సందేహం వ్యక్తం చేశాడు. 


ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉన్న డేవిడ్‌ వార్నర్‌ను తొలుత కెప్టెన్సీ నుంచి తొలగించిన ఎస్‌ఆర్‌హెచ్.. సోమవారం నాటి మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో కూడా చోటు ఇవ్వలేదు. దీంతో సామాన్య ప్రేక్షకులతోపాటు మాజీ ఆటగాళ్లు కూడా మండిపడుతున్నారు. `ఒక కెప్టెన్‌‌కు కొన్ని తప్పనిసరి బాధ్యతలు ఉంటాయి. ఎవరు తుది జట్టులో ఉండాలి, ఎవరిని పక్కన పెట్టాలి వంటి అంశాలపై నిర్ణయం అతడే తీసుకోవాలి. కొన్ని సార్లు ఆ నిర్ణయాలు యాజమాన్యాలకు నచ్చవు. అన్ని సార్లూ పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు. మొత్తానికి తెరవెనుక ఏదో జరుగుతోంద`ని స్టెయిన్ అన్నాడు. 

Advertisement
Advertisement
Advertisement