Abn logo
Mar 26 2020 @ 12:51PM

ఇప్పటికీ తెలంగాణ కంట్రోల్‌లోనే ఉంది: హరీష్‌రావు

సిద్దిపేట: కరోనా వైరస్ నేపథ్యంలో సరుకుల రవాణా ఆగి పోవడం వల్ల పట్టణాలలో కూరగాయల ధరలు పెరిగాయని.. గ్రామాల్లో తగ్గుముఖం పట్టాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గ్రామాల్లో కూరగాయల ధరలు తగ్గడం వల్ల రైతులు పంట పొలాల్లో పారబొస్తున్నారని తెలిపారు. హైదరాబాదులో మిర్చి ధర రూ.100, టమాట ధర 50 పలుకుతోందన్నారు. వ్యవసాయ శాఖ సమన్వయంతో సరుకులకు అనుగుణంగా వాహనాలను ఏర్పాటు చేస్తామన్నారు.


గ్రామం నుంచి ఒక రైతు, ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఏర్పాటు చేసి బోయినపల్లి మార్కెట్‌కు తరలించే ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ ప్రజలకు కూరగాయలు అందుబాటులో ఉండేలా వెసులుబాటు కల్పిస్తామన్నారు. ప్రధాని, సీఎం సూచనలను ప్రతి ఒకరూ పాటించాలన్నారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం కంట్రోల్‌లోనే ఉందన్నారు. అయినా అశ్రద్ధ , నిర్లక్ష్యం వద్దని.. చిన్నపిల్లల్ని బయటకు రానివ్వద్దని హరీష్‌రావు సూచించారు. ప్రతి ఒక్కరూ మూడు వారాలపాటు జాగ్రత్తగా ఉండాలన్నారు. మీకు తెలిసిన వారు ఎవరైనా తప్పు చేస్తే పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండన్నారు. 


Advertisement
Advertisement
Advertisement