Abn logo
Apr 7 2021 @ 10:03AM

లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు అండగా నిలవడంతో ఈ రోజు (బుధవారం)ను స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. 49,277 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10 గంటల సమయానికి 285 పాయింట్లు లాభపడింది. ఇక, 14,716 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన నిఫ్టీ ఉదయం 10 గంటల సమయానికి 90 పాయింట్లు ఎగబాకింది. అదానీ పోర్ట్స్, హిందాల్కో, రిలయన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభాలను ఆర్జిస్తున్నాయి. టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా నష్టాలను చవిచూస్తున్నాయి. 2021లో భారత జీడీపీ 12.5 శాతంగా ఉండొచ్చన్న ఐఎంఎఫ్‌ అంచనాలు మదుపర్లలో ఉత్సాహం నింపాయి. అయితే రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు భయాందోళనలను కలుగచేస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement