నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

ABN , First Publish Date - 2021-04-22T15:49:33+05:30 IST

దేశీయ స్టాక్ మార్కెట్లను కోవిడ్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

దేశీయ స్టాక్ మార్కెట్లను కోవిడ్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు అమలవుతుండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే వస్తున్నప్పటికీ గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. 47,501 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10 గంటల సమయానికి 200 పాయింట్లు నష్టపోయింది. ఇక, 14,219 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ ఉదయం 10 గంటల సమయానికి 50 పాయింట్లు కోల్పోయింది. టాటా స్టీల్, విప్రో, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాల్లో పయనిస్తుండగా.. శ్రీ సిమెంట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎమ్ అండ్ ఎమ్ నష్టాల బాట పట్టాయి. 

Updated Date - 2021-04-22T15:49:33+05:30 IST