Abn logo
May 4 2021 @ 16:25PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) ఆద్యంతం ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. లాభాలతో ప్రారంభమై కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. చివరికి భారీ నష్టాలతో రోజును ముగించాయి. 48,881 రోజును ప్రారంభించిన సెన్సెక్స్ 465 పాయింట్లు కోల్పోయి 48,253 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 48,996 వద్ద గరిష్టాన్ని, 48,149 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది.


ఇక, 14,687 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ 137 పాయింట్లు కోల్పోయి 14,496 వద్ద స్థిరపడింది. ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, ఎస్బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా లాభాలను ఆర్జించాయి. రిలయన్స్‌, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఇన్ఫోసిస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి. కోవిడ్ భయాలు, మూడో దశ వ్యాక్సినేషన్ విషయంలో గందరగోళం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. 

Advertisement
Advertisement
Advertisement