Abn logo
May 4 2021 @ 10:25AM

ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు!

సోమవారం స్వల్ప నష్టాలతో రోజును ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. లాభాలతో ప్రారంభమై కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. 48,881 రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10:10 గంటల సమయానికి 30 పాయింట్లు లాభపడింది. 


ఇక, 14,687 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ ఉదయం 10:10 గంటల సమయానికి 13 పాయింట్లు లాభపడింది. యూపీఎల్, హిందోల్కా, ఎస్బీఐ, బీపీసీఎల్ లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, విప్రో, శ్రీ సిమెంట్స్, రిలయన్స్ నష్టాలను చవిచూస్తున్నాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. కోవిడ్ భయాలు, మూడో దశ వ్యాక్సినేషన్ విషయంలో గందరగోళం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బ తీస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement