Abn logo
May 5 2021 @ 10:05AM

లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

మంగళవారం భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం)ను సానుకూలంగా ప్రారంభించాయి. కీలక రంగాల షేర్లు రాణిస్తుండండంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. 48,569 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10 గంటల సమయానికి 220 పాయింట్లు లాభపడింది. 


ఇక, 14,604 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ ఉదయం 10 గంటల సమయానికి 95 పాయింట్లు ఎగబాకింది. యూపీఎల్, భారతీ ఎయిర్‌టెల్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాలను ఆర్జిస్తున్నాయి. అదానీ పోర్ట్స్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్ నష్టాలను చవిచూస్తున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. 


Advertisement
Advertisement
Advertisement