Stock Market: చివర్లో కోలుకున్న మార్కెట్లు!

ABN , First Publish Date - 2021-06-02T21:28:05+05:30 IST

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం) తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.

Stock Market: చివర్లో కోలుకున్న మార్కెట్లు!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం) తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివర్లో కోలుకున్నాయి. సెన్సెక్స్ స్వల్ప నష్టాలతోనూ, నిఫ్టీ ఫ్లాట్‌గానూ రోజును ముగించాయి. 51749 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ చివరకు 85 పాయింట్లు కోల్పోయి 51849 వద్ద ముగిసింది. ఒక దశలో 300కు పైగా పాయింట్లను కోల్పోయినా చివర్లో కోలుకుంది. 


15,520 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన నిఫ్టీ చివరకు 1 పాయింటు లాభపడి 15,576 వద్ద స్థిరపడింది. యూపీఎల్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాలను ఆర్జించాయి. ఐటీసీ, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్ నష్టాలను చవిచూశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. 

Updated Date - 2021-06-02T21:28:05+05:30 IST