భారీ నష్టాల్లో మార్కెట్లు!

ABN , First Publish Date - 2021-04-05T16:12:49+05:30 IST

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

భారీ నష్టాల్లో మార్కెట్లు!

దేశంలో రోజు వారి కరోనా కేసులు లక్ష దాటడం, మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమవడం, పలు రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌లు అమలవుతుండడం వంటి కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1100కు పైగా పాయింట్లను కోల్పోయింది. 50,020 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10.30 గంటలకు 1162 పాయింట్లు కోల్పోయింది. ఇక, 14,837 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ ఉయదం 10.30 గంటల సమయానికి 319 పాయింట్లు కోల్పోయింది. విప్రో, బ్రిటానియా, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సెర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీ‌ఐ నష్టాలను చవిచూస్తున్నాయి.   

Updated Date - 2021-04-05T16:12:49+05:30 IST