స్టాక్‌ మార్కెట్లనూ మూసేయండి

ABN , First Publish Date - 2020-03-25T06:41:42+05:30 IST

స్టాక్‌, కమోడిటీ ట్రేడింగ్‌ను నిలిపివేయాలని మార్కెట్‌ వర్గాలు సెబీని కోరాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బ్రోకింగ్‌ సర్వీసులను అత్యవసర సేవలుగా గుర్తించని పక్షంలో అన్ని ఎక్స్ఛేంజీల్లో కార్యకలాపాలను నిలిపివేయాలని...

స్టాక్‌ మార్కెట్లనూ మూసేయండి

సెబీని కోరిన సీపీఏఐ, ఏఎన్‌ఎంఐ 


ముంబై: స్టాక్‌, కమోడిటీ ట్రేడింగ్‌ను నిలిపివేయాలని మార్కెట్‌ వర్గాలు సెబీని కోరాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బ్రోకింగ్‌ సర్వీసులను అత్యవసర సేవలుగా గుర్తించని పక్షంలో అన్ని ఎక్స్ఛేంజీల్లో కార్యకలాపాలను నిలిపివేయాలని ‘కమోడిటీ పార్టిసిపెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’(సీపీఏఐ) అం టోంది. కాగా, స్టాక్‌ ఎక్స్ఛేంజీలను కనీసం రెండ్రోజులైనా మూ సేయాలని అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఎక్స్ఛేంజెస్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎన్‌ఎంఐ) సెబీని అభ్యర్థించింది. తద్వారా బ్రోకరేజీ కంపెనీలకు ఔట్‌స్టాండింగ్‌ పొజిషన్స్‌ను క్లోజ్‌ చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని అసోసియేషన్‌ పేర్కొంది. 

Updated Date - 2020-03-25T06:41:42+05:30 IST