స్వల్ప ఊరట

ABN , First Publish Date - 2020-03-25T06:47:25+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద పతనాన్ని చవిచూసిన సూచీలకు మం గళవారం స్వల్ప ఊరట లభించింది. ఆసి యా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో పయనించడం దలాల్‌ స్ట్రీట్‌లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను సానుకూలంగా మార్చింది.

స్వల్ప ఊరట

స్టాక్‌ మార్కెట్లో రిలీఫ్‌ ర్యాలీ 

సెన్సెక్స్‌ 693 పాయింట్లు అప్‌

7,800 ఎగువ స్థాయికి నిఫ్టీ 

రూ.1.82 లక్షల కోట్లు పెరిగిన సంపద 


ముంబై: స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద పతనాన్ని చవిచూసిన సూచీలకు మం గళవారం స్వల్ప ఊరట లభించింది. ఆసి యా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో పయనించడం దలాల్‌ స్ట్రీట్‌లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను సానుకూలంగా మార్చింది. కరోనా ప్రభావం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు నష్టాన్ని చాలావరకు నివారించవచ్చన్న అభిప్రాయాలతో పాటు మోదీ సర్కారు కూడా భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనుందన్న అంచనాలు నేటి కొనుగోళ్లకు మద్దతిచ్చాయి. దాంతో సెన్సెక్స్‌ 692.79 పాయింట్లు లాభపడి 26,674.03 వద్ద ముగిసింది. నిఫ్టీ 190.80 పాయింట్లు బలపడి 7,801.05 వద్ద స్థిరపడింది. సోమవారం నాడు సెన్సెక్స్‌ దాదాపు 4,000 పాయింట్లు, నిఫ్టీ 1,100 పాయింట్లకు పైగా కోల్పోయి ఆల్‌ టైం అతిపెద్ద పతనాన్ని నమోదు చేసుకున్నాయి. బ్లూచి్‌పలతో పాటు మిడ్‌క్యాప్‌ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 1.56 శాతం పెరిగింది. మంగళవారం సెషన్‌లో  ఇన్వెస్టర్ల  సంపద రూ.1.82 లక్షల కోట్లు పెరిగింది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,03,69, 706.20 కోట్లకు చేరుకుంది. 


సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 19 లాభపడగా.. మిగతా 11 నష్టపోయాయి. 


ఇన్ఫోసిస్‌ 12.69 శాతం బలపడి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫైనాన్స్‌ 9.78 శాతం, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ 8.34 శాతం పుంజుకున్నాయి. 


మహీంద్రా అండ్‌ మహీంద్రా షేరు అత్యధికంగా 8.32 శాతం నష్టపోయింది. ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ మరో 7.19 శాతం పడింది. 


రంగాలవారీగా చూస్తే.. బీఎ్‌సఈ ఐటీ, టెక్నాలజీ, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, బ్యాంకెక్స్‌, ఫైనాన్స్‌, మెటల్‌ సూచీలు 6.95 శాతం వరకు పెరిగాయి. 


రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌, బేసిక్‌ మెటీరియల్స్‌ ఇండెక్స్‌లు మాత్రం నష్టాల్లో పయనించాయి.

Updated Date - 2020-03-25T06:47:25+05:30 IST