కార్పొరేట్‌ ఫలితాలతోనే దిశ !

ABN , First Publish Date - 2021-04-12T06:08:16+05:30 IST

ఈ వారం నుంచి వెలువడనున్న కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. అలాగే ద్రవ్యోల్బణ గణాంకాలు, పారిశ్రామికోత్పత్తి డేటా కూడా కీలకంగా ఉండనున్నాయి. రానున్న రోజుల్లో స్టాక్‌ ఆధారిత ర్యాలీ ఉండే అవకాశాలున్నాయి

కార్పొరేట్‌ ఫలితాలతోనే దిశ !

ఈ వారం నుంచి వెలువడనున్న కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. అలాగే ద్రవ్యోల్బణ గణాంకాలు, పారిశ్రామికోత్పత్తి డేటా కూడా కీలకంగా ఉండనున్నాయి. రానున్న రోజుల్లో స్టాక్‌ ఆధారిత ర్యాలీ ఉండే అవకాశాలున్నాయి. ఈ వారం నిఫ్టీ 14900-15000లను అధిగమించి నిలకడగా సాగే  అవకాశం ఉంది.  ఒకవేళ  డౌన్‌ట్రెండ్‌లోకి సాగితే 14700,14550 వద్ద మద్దతు స్థాయిలుంటాయి.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     

స్టాక్‌ రికమండేషన్స్‌

బలరాంపూర్‌ చినీ: ఈ షేరు మరోసారి బ్రేకౌట్‌ సాధించి నిలకడగా సాగుతోంది. వాల్యూమ్స్‌ కూడా మెరుగ్గా ఉన్నాయి. గత శుక్రవారం రూ.234.30 వద్ద క్లోజైన ఈ షేరు.. రానున్న రోజుల్లో రూ.230-226 స్థాయిలకు చేరితే రూ.255 టార్గెట్‌ ధరతో దీర్ఘకాలానికి కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.213 స్థాయి ని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

ఫైజర్‌: ఇటీవలి కన్సాలిడేషన్‌ జోన్‌ నుంచి ఈ షేరు బయటపడింది. రోజువారీ వాల్యూమ్స్‌ కూడా గణనీయంగా పెరుగుదలను నమోదు చేశాయి. గత శుక్రవారం రూ.4,802.05 వద్ద క్లోజైన ఈ షేరు.. రూ.4,750 స్థాయిలకు పడినప్పుడు రూ.5,100 టార్గెట్‌ ధరతో దీర్ఘకాలానికి కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.4,550 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి. 

బజాజ్‌ ఫైనాన్స్‌: డైలీ చార్టుల ప్రకారం చూస్తే ఈ షేరు కొద్దిగా ఆటుపోట్లకు లోనవుతూ వస్తోంది. గత శుక్రవారం ఈ షేరు మద్దతు స్థాయిలైన రూ.4,900 దిగువకు చేరింది. రానున్న రోజుల్లో ఈ షేరు మరింత బలహీనపడే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.4,872.30 వద్ద క్లోజైన ఈ షేరును రూ.4,600 స్థాయిని టార్గెట్‌గా పెట్టుకుని విక్రయిం చే అవకాశాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.5,010 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

 - సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలి్‌స్ట,టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌


నోట్‌:  పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.


Updated Date - 2021-04-12T06:08:16+05:30 IST