స్టాక్‌ రికమండేషన్స్‌

ABN , First Publish Date - 2020-09-21T06:12:04+05:30 IST

కొంతకాలంగా రూ.390 స్థాయి వద్ద పలు ఆటంకాలు ఎదుర్కొంటూ వస్తున్న ఈ షేరు గత శుక్రవారం అనూహ్యంగా ఆ స్థాయిలను అధిగమించి రూ.404.15 వద్ద క్లోజైంది...

స్టాక్‌ రికమండేషన్స్‌

ఆర్‌పీజీ లైఫ్‌సైన్సెస్‌: కొంతకాలంగా రూ.390 స్థాయి వద్ద పలు ఆటంకాలు ఎదుర్కొంటూ వస్తున్న ఈ షేరు గత శుక్రవారం అనూహ్యంగా ఆ స్థాయిలను అధిగమించి రూ.404.15 వద్ద క్లోజైంది. రానున్న కొద్ది రోజుల్లో ఈ షేరు ప్రస్తుత స్థాయిల నుంచి రూ.395కి పడిపోతే దీర్ఘకాలానికి రూ.448 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.374 స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.  


క్విక్‌హీల్‌: ప్రస్తుతం ఈ షేరుకు సం బంధించిన డైలీ చార్టులు.. కప్‌ అండ్‌ హ్యాండిల్‌ ప్యాటర్న్‌తో పాటు ఇన్వర్స్‌ హెడ్‌, షోల్డర్‌ను సూచిస్తున్నాయి. గత శుక్రవారం రూ.154.30 వద్ద క్లోజైన ఈ షేరును దీర్ఘకాలానికి కొనుగోలు చేయవచ్చు. ఈ షేరు రూ.150-రూ.145 స్థాయిలకు పడినప్పుడు రూ.184 మధ్యకాలిక టార్గెట్‌తో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. రూ. 132 స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 


జుబిలెంట్‌ ఫుడ్‌: గత శుక్రవారం ఈ షేరు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని రూ.2,360.80 వద్ద ముగిసింది. డైలీ చార్టుల ప్రకారం బేరిష్‌ ప్యాట్రన్‌ను సూచిస్తోంది. ఈ డౌన్‌ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే రూ.2,280-రూ.2,240 వద్ద ఈ షేరును షార్ట్‌ చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. రూ.2,420 స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 


టాటా స్టీల్‌ : టెక్నికల్‌గా ఈ షేరు చా లా కాలంగా 20 రోజుల ఈఎంఏ దిగువన ఉండటంతో కొంత బలహీనతను సూచిస్తోంది. డైలీ చార్టుల ప్రకారం ఈ షేరులో లాభాల స్వీకరణ కొనసాగే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.395.80 వద్ద క్లోజైన ఈ షేరును రూ.380-రూ.376 టార్గెట్‌ ధరతో షార్ట్‌ చేసే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. రూ.408 స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి. 

- సమీత్‌ చవాన్‌, చీఫ్‌ అనలిస్ట్‌ టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌ 


నోట్‌:  పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.


Updated Date - 2020-09-21T06:12:04+05:30 IST