స్టాక్‌ ఆధారిత విధానం బెటర్‌!

ABN , First Publish Date - 2021-10-18T07:37:50+05:30 IST

గత వారం మార్కెట్లలో పూర్తిగా బుల్‌ జోరు కనిపించింది. ప్రధానంగా బ్యాకింగ్‌ విభాగం ర్యాలీకి దన్నుగా నిలిచింది. ఈ వారం త్రైమాసిక ...

స్టాక్‌ ఆధారిత విధానం బెటర్‌!

గత వారం మార్కెట్లలో పూర్తిగా బుల్‌ జోరు కనిపించింది. ప్రధానంగా బ్యాకింగ్‌ విభాగం ర్యాలీకి దన్నుగా నిలిచింది.  ఈ వారం త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కె ట్లు దేశీయ మార్కెట్‌ గమనాన్ని నిర్ధేశించనున్నాయి. ఈ వారం కూడా మార్కెట్లలో ర్యాలీ కొనసాగే అవకాశాలున్నాయి. నిఫ్టీకి 18500 వద్ద మానసిక అవధి స్థాయిలున్నాయి. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తే 18200-18000 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. డౌన్‌ట్రెండ్‌ను సూచించినా మళ్లీ బుల్‌ పట్టులోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ట్రేడర్లు స్టాక్‌ ఆధారిత విధానాన్ని అనుసరించటం మంచిది. 


స్టాక్‌ రికమండేషన్స్‌

హెచ్‌బీఎల్‌ పవర్‌: గడచిన నాలుగు నెలలుగా ఈ షేరు కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. చివరకు గత వారం బ్రేకౌట్‌ను సాధించింది. ప్రస్తుత ధరల వద్ద మంచి వాల్యూమ్స్‌ను కనబరిచింది. గత శుక్రవారం రూ.54.70 వద్ద క్లోజైన ఈ షేరును స్వల్పకాలానికి రూ.61 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలింవచ్చు. అయితే రూ.49.80 స్థాయిని స్టాప్‌లా స్‌గా పెట్టుకోవాలి.  

యునైటెడ్‌ స్పిరిట్స్‌: కొద్ది నెలలుగా ఈ షేరు రికార్డు స్థాయిల నుంచి పడుతూ వస్తోంది. అయితే ఇది సుదీర్ఘ ర్యాలీ అనంతరం వచ్చే కరెక్షన్‌గా భావించవచ్చు. కొన్ని నెలలుగా డైలీ ముగింపు ప్రకారం చూస్తే 5 డే ఈఎంఏ దిగువన క్లోజవుతూ వస్తోంది. గత శుక్రవారం రూ.888.60 వద్ద క్లోజైన ఈ షేరును రూ.850 స్థాయిని టార్గెట్‌గా పెట్టుకుని స్వల్పకాలానికి విక్రయించే విషయాన్ని ట్రేడర్లు పరిశీలించవచ్చు. అయితే రూ.911 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

- సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలి్‌స్ట,టెక్నికల్‌,

 డెరివేటివ్స్‌, ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌ 

Updated Date - 2021-10-18T07:37:50+05:30 IST