Abn logo
Jan 26 2021 @ 00:24AM

రైలు బోగీలపై రాళ్లతో దాడి

మేడ్చల్‌: మేడ్చల్‌ మండలం గౌడవెల్లి నుంచి వెళ్లే రైల్వే ఔటర్‌ రింగు రోడ్డు బ్రిడ్జి వద్ద  సోమవారం ఉదయం 8గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటర్‌ ప్లస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలపై రాళ్లతో దాడి చేశారు. రాళ్లు విసరడంతో రైలు బోగీ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన జరిగిన వెంటనే ప్రయాణికులు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైల్వే ఆర్‌పీఎఫ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. గౌడవెల్లి పంచాయతీ కార్యాలయానికి చేరుకుని సర్పంచ్‌ సురేందర్‌, గ్రామస్థులతో చర్చించారు. గుర్తుతెలియని ఆకతాయిలు రాళ్లు విసిరినట్లు గ్రామస్థులు వారికి వివరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు సూచించారు. 

Advertisement
Advertisement