Abn logo
Apr 18 2021 @ 23:38PM

స్టోన్‌ క్రషర్‌ అనుమతులు రద్దు చేయాలి


 

కొత్తూరు, ఏప్రిల్‌ 18 : మండలంలోని సుందరయ్యపేట పంచాయతీ మొండుపాలెం  లో ఉన్న అన్నపూర్ణదేవి స్టోన్‌ క్రషర్‌ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు స్టోన్‌ క్రషర్‌ ముందు ఆదివారం ధర్నా నిర్వహించారు. గ్రామానికి సమీపంలో ఉన్న వంద టన్నుల సామర్థ్యం గల పాత స్టోన్‌ క్రషర్‌ పక్కనే విస్తరణ పేరుతో 1300 టన్నుల భారీ స్టోన్‌ క్రషర్‌ను నిర్మించారని, దీనివల్ల ఇళ్లలోని దుమ్ము, ధూళి చేరుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నపూర్ణదేవి స్టోన్‌ క్రషర్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.    ఏ విధంగా అనుమతులిచ్చారో ఏసీబీ విచారణ జరపాలని నినాదాలు చేశారు. అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పీఎస్‌ అజయ్‌కుమార్‌,  సర్పంచ్‌ బాదపు తాతారావు, వార్డు సభ్యురాలు పి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement