జగిత్యాలలో రాళ్ల వాన

ABN , First Publish Date - 2022-04-28T05:56:56+05:30 IST

అధిక ఊష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం ఒక్కసారిగా చల్లబడ్డారు.

జగిత్యాలలో రాళ్ల వాన
జగిత్యాల పట్టణంలో పడుతున్న రాళ్ల వాన

 ఎండ వేడిమి నుంచి జనం ఉపశమనం

జగిత్యాల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): అధిక ఊష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం ఒక్కసారిగా చల్లబడ్డారు. పట్టణంలోని విద్యా నగ ర్‌, కృష్ణానగర్‌, భీష్మానగర్‌, విద్యాపురి తదితర కాలనీల్లో రాళ్లతో కూడిన వర్షం కొద్ది నిమిషాలు కురిసింది. దీంతో ఎండకు మాడిపోతున్న జనానికి రాళ్ల వాన కాస్త ఉపశమనం కలిగించింది. వర్షం వల్ల రహదారులు జలమయమయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడం వల్ల కొద్దిసేపు విద్యుత్‌ సరాఫరాకు అంతరాయం కలిగింది. పట్టణంలో 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత , 42.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వర్షం వల్ల చిరు వ్యాపారులు కొద్దిగా ఇక్కట్ల పాలయ్యారు. వర్షంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు.


Updated Date - 2022-04-28T05:56:56+05:30 IST