నిర్వహణ నిల్‌

ABN , First Publish Date - 2021-06-18T05:12:33+05:30 IST

‘నా భర్త నన్ను అదన పు కట్నం కోసం వేధిస్తున్నాడు..

నిర్వహణ నిల్‌
సఖి కేంద్రం గురించి విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న నిర్వాహకులు (ఫైల్‌)

- మూతపడిన సఖి కేంద్రం

- బాధితులకు జరగని న్యాయం


నారాయణపేట క్రైం, జూన్‌ 17 : ‘నా భర్త నన్ను అదన పు కట్నం కోసం వేధిస్తున్నాడు.. నా భర్త మద్యం తాగి న న్నూ.. నా పిల్లల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు.. నా భర్త నాతో కాపురం చేయకుండా, మరో మహిళతో వి వాహేతర సంబంఽధం పెట్టుకున్నాడు..’ అంటూ వివిధ సమస్యలతో మహిళలు న్యాయం కోసం పోలీస్‌ స్టేష న్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, వీరి సమస్యల ప రిష్కారం పోలీసులకు తలకు మించిన భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వేధింపులకు గురై బయటకు చెప్పుకోలేని మహిళలకు మనోదైర్యం కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆ ధ్వర్యంలో నారాయణపేటలో సఖి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రం ని ర్వహణ లేకపోవడంతో వ్యక్తిగత సమస్య లతో పాటు న్యాయపరమైన సేవ, వైద్య, సలహా, పోలీసు కేసు నమోదు, సాంత్వ న, తాత్కాలిక వసతి తదితర సేవలు మహిళలకు అందడం లేదు.

2020 డిసెంబరు 20న జిల్లా కేం ద్రంలోని బీసీ కాలనీలో కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మహిళల సమస్యల పరిష్కా రం కోసం సఖి కేంద్రాన్ని ఏ ర్పాటు చేశారు. ఈ కేంద్రం ని ర్వహణ బాధ్యతలను రాహుల్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసె స్‌ సొసైటీ అనే స్వచ్భంద సంస్థకు అప్పగించారు. ఇప్పటి వ రకు ఈ కేంద్రానికి 200 ఫిర్యాదులు రాగా, అందులో 150కి పైగా మహిళలకు సంబంధించినవి ఉన్నాయి. కౌన్సెలింగ్‌ ద్వా రా ఈ సమస్యలను పరిష్కరించారు. 2021 ఏప్రిల్‌ 12న కేంద్రం మూతపడింది. కేంద్రం మూతపడటానికి కారణాలు ఏమైనా, బాధిత మహి ళలకు మాత్రం న్యాయం జరగడం లేదు.

Updated Date - 2021-06-18T05:12:33+05:30 IST