Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాల్వలకు నీరు నిలుపుదల


నిడదవోలు, డిసెంబరు 2 : పశ్చిమ డెల్టా కాలువలకు విజ్జేశ్వరం హెడ్‌ స్లూయీజ్‌ నుంచి గురువారం నీటి విడుదలను నీటిపారుదల శాఖాధికారులు నిలిపివేశారు. ఇప్పటికే ఖరీఫ్‌లో వరి కోతలు వేగవంతంగా సాగుతున్నాయి. ఖరీఫ్‌లో వరికి నీటి అవసరం లేకపోవడంతో వచ్చే రబీని దృష్టిలో పెట్టుకుని కాలు వలలో తూడు తొలగింపు పను లు వేగవంతం చేసే పనిలో భాగంగా జీఅండ్‌వీ, నరసా పురం, ఉండి, ఏలూరు, అత్తిలి కాలువలకు నీటి విడుద లను పూర్తిస్థాయిలో నిలిపివేశారు. మరోవైపు ధవళేశ్వరం, ర్యాలి, మద్దూరు విజ్జేశ్వరం ఆరమ్స్‌ నుంచి సముద్రంలోకి 31,047 క్యూసెక్కుల అదనపు జలాలను విడిచిపెట్టారు.

Advertisement
Advertisement