Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 8 2021 @ 11:34AM

‘సారీ... పెళ్లికొడుకు నచ్చలేదు’

ఆఖరి క్షణంలో వివాహం ఆపిన యువతి

చెన్నై/పెరంబూర్: పెళ్లికొడుకు తనకు నచ్చలేదంటూ ఆఖరి నిమిషంలో వివాహాన్ని పెళ్లికుమార్తె అడ్డుకోవడంతో బంధువులు దిగ్ర్భాంతి చెందారు. వేలూరు జిల్లా పాక్కంకు చెందిన షణ్ముఖప్రియ (25)కు కుచ్చిపాళయానికి చెందిన బాలమురుగన్‌ (31)కు గత నెల నిశ్చితార్థం జరగ్గా, సోమవారం వివాహం నిర్ణయించారు. పల్లికొండలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి పాట కచ్చేరి, వధూవరుల ఆహ్వాన వేడుకలు జరిగాయి. సోమవారం ఉదయం 9 గంటలకు వివాహం జరగాల్సిన తరుణంలో 6 గంటలకు తల్లిదండ్రులకు వద్దకు వెళ్లిన షణ్ముఖప్రియ.. తనకు పెండ్లి కొడుకు నచ్చలేదని, తాను వివాహం చేసుకోనని, బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. దీంతో, దిగ్ర్భాంతి చెందిన తల్లిదండ్రులు, బంధువులు ఆమెను ఎంత బతిమిలాడినా అంగీకరించలేదు. దీంతో, ఇరుతరఫు పెద్దలు కూర్చొని మాట్లాడుకొని వివాహాన్ని నిలిపివేశారు. 

Advertisement
Advertisement