ఆగిన ‘తల్లీబిడ్డ’ ఎక్స్‌ప్రెస్‌

ABN , First Publish Date - 2021-08-02T06:33:04+05:30 IST

‘తల్లీ బిడ్డ’ ఎక్స్‌ప్రెస్‌ సేవలు ఆదివారం నుంచి ఆగా యి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం తర్వాత తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చాలనే ఆశయంతో గత ప్రభుత్వం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను జీవీకే సంస్థ నిర్వహించింది.

ఆగిన ‘తల్లీబిడ్డ’ ఎక్స్‌ప్రెస్‌

మదనపల్లె క్రైం, ఆగస్టు 1: ‘తల్లీ బిడ్డ’ ఎక్స్‌ప్రెస్‌ సేవలు ఆదివారం నుంచి ఆగా యి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం తర్వాత తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చాలనే ఆశయంతో గత ప్రభుత్వం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను జీవీకే సంస్థ నిర్వహించింది. జిల్లాలో 28 వాహనాలున్నాయి. ఆ సంస్థ ఒప్పంద గడువు గతనెల 31తో ముగిసింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం.. కొనసాగింపుపై స్పందన లేకపోవడంతో వాహన సేవలు నిలిచి పోయాయి. జీవీకే సంస్థ వాహన డ్రైవర్లను తొలగించినట్లు తెలుస్తోంది. పైగా నాలుగునెలల నుంచి వేతనాలు విడుదల కాకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. సంస్థకు 8 నెలలుగా బిల్లులు రాకపోవడంతో జీతాలు పెండింగ్‌లో ఉన్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. 




Updated Date - 2021-08-02T06:33:04+05:30 IST