‘గూగుల్‌ పిక్సెల్‌’తో స్టోరేజ్‌ అపరిమితం

ABN , First Publish Date - 2021-05-08T05:54:34+05:30 IST

‘గూగుల్‌ ఫోటోస్’లో హైక్వాలిటీ ఫోటోలను అపరిమితంగా స్టోర్‌ చేసుకునే సదుపాయం ఇవ్వడం లేదు. అయితే ‘పిక్సెల్‌’ యూజర్లకు మాత్రం ఖుష్‌ కబర్‌ చెబుతోంది.

‘గూగుల్‌ పిక్సెల్‌’తో స్టోరేజ్‌ అపరిమితం

‘గూగుల్‌ ఫోటోస్’లో హైక్వాలిటీ ఫోటోలను అపరిమితంగా స్టోర్‌ చేసుకునే సదుపాయం ఇవ్వడం లేదు. అయితే ‘పిక్సెల్‌’ యూజర్లకు మాత్రం ఖుష్‌ కబర్‌ చెబుతోంది. ‘పిక్సెల్‌ ఫోన్ల’ను ఉపయోగించే వ్యక్తులకు మాత్రం ఎంతమేరకైనా ఫోటోలను స్టోర్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. న్యూపిక్సెల్‌ ఫోన్‌లో ‘స్టోరేజ్‌ సేవర్‌’ ఆప్షన్‌ ఉంటుందని తద్వారా అపరిమితంగా ఫోటోలను సేవ్‌ చేసుకోవచ్చని ఎక్‌డిఎ డెవలపర్స్‌ ఒక నివేదికలో వెల్లడించింది. పిక్సెల్‌ యూజర్‌ కాని పక్షంలో ఫోటోలు, డాక్యుమెంట్లు సహా ఏవైనా దాచుకునేందుకు విధించిన పరిమితి 15 జీబీ మాత్రమే. అంతకుమించి స్టోరేజ్‌ కోసం సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నే ‘గూగుల్‌ వన్‌’ అంటున్నారు. ఈ ప్లాన్‌ కింద నెలకు 100 జీబీ కోసం రూ.130, 200 జీబీ కోసం రూ.210 చెల్లించాలి. 2 టీబీ కోసం నెలకు రూ.650 కట్టాలి. వార్షిక ప్లాన్‌ కింద 200 జీబీ, 2టీబీ కోసం వరుసగా రూ.2100, రూ.6500 కట్టాల్సి ఉంటుంది. 


‘పిక్సెల్‌ ఫోన్‌’ విషయానికి వస్తే, ఆండ్రాయిడ్‌కు సంబంధించి గూగుల్‌ అదనంగా అలా్ట్ర వైడ్‌ బ్యాండ్‌ సాంకేతికతతో పనిచేస్తున్నట్టు సమాచారం. హార్డ్‌వేర్‌ పరంగా పిక్సెల్‌ 6తో వస్తోందనే వార్తలు మాత్రం ఉన్నాయి. అలా్ట్ర వైడ్‌ బ్యాండ్‌ సాంకేతికతతో వచ్చే డివైస్‌ కోడ్‌ ‘రవీన్‌’గా చెబుతున్నారు. 


గూగుల్‌ పిక్సల్‌ 6

ర్యామ్‌ 6 జీబీ 6 జీబీ, కెమెరా 16 ఎంపి + 16 ఎంపి + 12 ఎంపి, డిస్‌ప్లే 6.2 ఇంచీలు(15.74 సెం.మీ), పర్ఫార్మెన్స్‌ క్వాల్కామ్‌ స్నాప్‌డ్రాగాన్‌ 875(5ఎన్‌ఎం), స్టోరేజ్‌ 128 జీబీ, బ్యాటరీ 4500 ఎంఎహెచ్‌, ఇండియాలో ధర రూ.51,299.

 

గూగుల్‌ పిక్సల్‌ 

పర్ఫార్మెన్స్‌ స్నాప్‌డ్రాగాన్‌ 821, డిస్‌ప్లే 5 ఇంచీలు(12.7 సెం.మీ),  స్టోరేజ్‌ 32 జీబీ,  కెమెరా  12.3 ఎంపి, బ్యాటరీ 2770 ఎంఎహెచ్‌,  ర్యామ్‌ 4 జీబీ. 

Updated Date - 2021-05-08T05:54:34+05:30 IST